Bus Catches Fire near Mettupalayam: 52 మంది విద్యార్థులతోపాటు మరో ఐదుగురు తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. తమిళనాడులోని మెట్టుపాళయం సమీపంలో నడుస్తున్న ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనుక వస్తున్న మరో డ్రైవర్ అప్రమత్తం చేయడంతో బస్సు వెంటనే నిలిపివేసి.. అందరినీ కిందకు దించేశారు. దీంతో అదృష్టవశాత్తూ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నమక్కల్ జిల్లా రాశిపురం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు సహా 57 మంది ఈ 6న ఓ ప్రైవేట్ బస్సులో ఊటీకి విహారయాత్రకు వెళ్లారు. ఊటీలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనంతరం శనివారం రాత్రి ఊటీ నుంచి నమక్కల్‌కు తిరుగుపయనం అయ్యారు. మార్గమధ్యంలో మెట్టుపాళయం సమీపంలోని కాళ్లారు వంతెన దగ్గర వస్తుండగా బస్సు కుడి వెనుక టైరులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించని బస్సు డ్రైవర్ అలానే నడుపుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి కావడంతో విద్యార్థులు కూడా నిద్రలో ఉన్నారు.


ఈ సందర్భంలో బస్సు వెనుక ఉన్నవస్తున్న మరో డ్రైవర్ మంటల గురించి తెలియజేశారు. దీంతో డ్రైవర్ బస్సును అక్కడికక్కడే నిలిపివేసి.. వారందరినీ కిందకు దించేశాడు. ఈ క్రమంలో గాలి వేగంతో బస్సులో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఇరుగుపొరుగు వారు మెట్టుపాళయం పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 


బస్సులోని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే అప్పటికీ బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో 2 గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై మెట్టుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!  


Also Read: IND Vs AUS ICC World Cup 2023: టీమిండియా తొలి సమరం రేపే.. ఆసీస్‌తో హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు, పిచ్ రిపోర్ట్ వివరాలు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి