Fridge Explode: వసతిగృహంలో అమ్మాయిలంతా హాయిగా నిద్రపోతున్నారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన ప్రమాదం హాస్టల్‌లో బీభత్సం సృష్టించింది. నిత్యం ఉపయోగించే రిఫ్రిజిరేటర్‌ బాంబులా పేలింది. కంప్రెషర్‌ పేలి హాస్టల్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పేలుడు ధాటికి ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్‌ చేయి పట్టుకు లాగిన రోగి


 


తమిళనాడులోని మధురై పట్టణంలోని పెరియార్‌ బస్టాండ్‌ సమీపంలో విశాఖ వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ ఉంది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు హాస్టల్‌లోని రిఫ్రిజిరేటర్‌ కంప్రెషర్‌ పేలిపోయింది. పేలుడు ధాటికి మంటలు ఒక్కసారిగా చెలిరేగిపోయాయి. దీంతో వసతిగృహంలో ఉన్న చెక్కలకు మంటలు అంటుకుని భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. పొగలు దట్టంగా వ్యాపించడంతో హాస్టల్‌లో ఉన్న యువతులు అంతా భయాందోళన చెందారు.

Also Read: Insta Reels: ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం


 


స్థానికులు, హాస్టల్‌ నిర్వాహకులు సమాచారం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదంలో దట్టమైన పొగలను తట్టుకోలేక ఊపిరాడక ఇద్దరు యువతులు మరణించారు. మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. హాస్టల్‌ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


మృతులు వీరే..
కాగా మృతి చెందిన ఇద్దరిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పరిమళ సౌందర్య (50), ప్రైవేటు కేటరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపాధ్యాయురాలు శరణ్య (40) ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం 24 మంది మహిళలను రక్షించారు. కాగా హాస్టల్‌ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే హాస్టల్‌ నిబంధనలకు అనుగుణంగా లేదని పోలీసులు గుర్తించారు. హాస్టల్‌కు లైసెన్స్‌ లేదని తెలిసింది. అంతేకాకుండా ఈ భవనానికి సంబంధించిన ఆస్తి వివాదం ఉందని తేలింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter