Kurla Bus Accident CCTV Footage: ముంబైలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 42 మంది గాయపడిన విషయం తెలిసిందే. కుర్లా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు డ్రైవర్‌కు భారీ వాహనాలు నడపడంలో సరిపడా అనుభవం లేనట్లు పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రిక్ బస్సు కుర్లా భాజీ మార్కెట్ వద్ద బండితో సహా 22 వాహనాలను, రద్దీగా ఉండే పాదచారులను ఢీకొట్టినట్లు తెలిపారు. డ్రైవర్ డిసెంబరు 1న విధుల్లో చేరాడని.. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి బెస్ట్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా చీఫ్ మేనేజర్‌తో సహా ఐదుగురు కమిటీ సభ్యులుగా ఉన్నారు. డ్రైవర్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు. డ్రైవింగ్‌లో పొరపాటు జరిగే అవకాశం కూడా తాము పరిశీలిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ V) గణేష్ గవాడే తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదానికి ముందు బస్సులోపల షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు ఎందుకు దూసుకుపోయిందో వాళ్లకు అర్థం కాలేదు. కండెక్టర్ ప్రయాణికులకు టిక్కెట్లు ఇస్తుండగా.. ఒక్కసారిగా బస్సు వేగం పుంజుకుంది. డ్రైవర్ అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ.. దారిలో ఉన్న వారిని ఢీకొట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు.. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు బయటకు పారిపోయారు.  


 




డ్రైవర్ సంజయ్ దత్తా మోరే ఎలక్ట్రిక్ వాహనం నడిపేందుకు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నాలుగు రోజుల శిక్షణ తీసుకున్నారని బెస్ట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సును బెస్ట్ వెట్ లీజుకు తీసుకుంది. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..  సెక్షన్‌లు 105, 110, 118 కింద కేసు నమోదు చేశారు. కుర్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. డిసెంబర్ 21 వరకు కస్టడీ విధించారు. డ్రైవర్ డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం మత్తులో ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి కస్టడీకి ఇవ్వాలని విచారణ అధికారులు విజ్ఞప్తి చేశారు.


ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సంఘటనలో గాయపడిన వారి చికిత్స ఖర్చులను భరించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు చనిపోయిన వారికి బెస్ట్ రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది.


Also Read: Business Ideas: 40 రోజుల్లో లక్షలు సంపాదించే అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. కిర్రాక్ బిజినెస్ ఐడియా భయ్యా ఇది  


Also Read: Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook