Brahmaji Imitates Mallareddy టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తెరపైన ఎంతగా కామెడీ పండిస్తాడో.. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అంతకంటే ఎక్కువగా సందడి చేస్తుంటాడు. ఇక స్టేజ్ మీద సుమ ఉంటే.. వచ్చే సెటైర్లు వేరే లెవెల్లో ఉంటాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బ్రహ్మాజీని సుమ ఆడేసుకుంది. ఇక బ్రహ్మాజీ సైతం తన స్పీచుతో అదరగొట్టేశాడు. అసలే బ్రహ్మాజీ సోషల్ మీడియా ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతుంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇంత డబ్బు ఎలా సంపాదించారు అని ఓ రిపోర్టర్ అడిగితే.. ఆయన చెప్పిన సమాధానాలను జనాలు ఎలా ట్రోల్స్ చేశారు.. ఎలా మీమ్స్ వేశారో అందరికీ తెలిసిందే. అదే టైపులో బ్రహ్మాజీ కూడా డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించాడు.


అదృష్టం.. కష్టపడిన.. తారక్ పరిచయం అయిండు.. సినిమాలు చేసిన అని మల్లారెడ్డి స్టైల్లో బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్స్‌కు అందరూ నవ్వేశారు. ఇక సుమ కోరిక మేరకు బ్రహ్మాజీ నాటు నాటు స్టెప్పులు కూడా వేశాడు. కాళ్లు లేనోళ్ల మాదిరిగా మోకాళ్ల మీద కూర్చుని వింతగా స్టెప్పులు వేయడంతో సుమ కౌంటర్లు వేసింది. నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లి చాలా కాలమైంది.. ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది అంటూ బ్రహ్మాజీ పరువుతీసేసింది.


నాలా ఎవ్వరైనా స్టెప్పులు వేయగలరా? అని బ్రహ్మాజీ అంటే.. అవునవును మీలా మోకాళ్ల మీద ఎవ్వరూ స్టెప్పులు వేయలేరు అంటూ సెటైర్లు వేసింది.అలా బ్రహ్మాజీ వేసిన స్టెప్పులకు కింద ఉన్న కళ్యాణ్‌ రామ్, ఎన్టీఆర్‌లు పగలబడి నవ్వేశారు. ఫిబ్రవరి 10న రాబోతోన్న అమిగోస్ సినిమాలో బ్రహ్మాజీ కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది.


Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?


Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి