Actor Suriya's Residence Gets Police Protection After Jai Bhim 'Hurts' Vanniyar Sentiments: హీరో సూర్య నటించిన జై భీమ్‌ మూవీ చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓటీటీలో విడుదలై ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. అయితే మూవీ ఎంత హిట్ అయ్యిందో.. అంతలా వివాదాలు కూడా మూటగట్టుకుంది. వన్నియర్‌ సంఘం (Vanniyar Sangam) తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే జై భీమ్‌ మూవీ (Jai Bhim) యూనిట్‌కు లీగల్‌ నోటీసులు పంపింది. ఆ తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నైలోని సూర్య (Suriya) నివాసం వద్ద పోలీసులు భారీ ఎత్తున బందోబస్తుగా ఉన్నారు. మరోవైపు సూర్యకు పలువురు ప్రముఖులు, అభిమానులు అండగా నిలుస్తున్నారు. సూర్యకు మద్దతుగా సోషల్‌ మీడియాలో (Social media) కూడా ఒకే రేంజ్‌లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.


Also Read : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ సినిమా ట్రైలర్ వచ్చేసింది


కాగా జై భీమ్ సినిమా విషయంలో వన్నియర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్నారు. అంతేకాదు తమ వర్గాన్ని కించపరిచిన సూర్యని ఎవరైనా కొడితే లక్ష రూపాయల బహుమానం ఇస్తామంటూ పీఎంకే నేతలు ప్రకటించారు. జై భీమ్ (Jai Bhim) మూవీలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణ. 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ జై భీమ్ (Jai Bhim) నిర్మాత సూర్యకు (Suriya) వన్నియార్ సంగం (Vanniyar Sangam) నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి వన్నియార్ సంఘం నోటీసులు పంపింది.


Also Read : ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook