నీట్ పరీక్షలకు ( NEET Exams ) సంబంధించి నటుడు సూర్య ( Actor Surya ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కోర్టు ధిక్కారమవుతుందని స్వయంగా న్యాయమూర్తి అభిప్రాయపడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు ( Tamilnadu ) లో నీట్ పరీక్షకు కొద్దిరోజుల ముందు నలుగురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళ, తెలుగు హీరో సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపధ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారని..అయితే విద్యార్ధుల్ని మాత్రం నిర్భయంగా వెళ్లి పరీక్షలు రాయమనడంలో నైతికత లేేదని సూర్య ట్వీట్ చేసినట్టుగా జస్టిస్ సుబ్రహ్మణ్యం ( Justice Subrahmanyam ) ఛీఫ్ జస్టిస్ ( letter to Chief justice ) కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని..ఆయనపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సుబ్రహ్మణ్యం లేఖలో కోరారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమై వైరల్ అవుతున్నాయి. జస్టిస్ సుబ్రహ్మణ్యం చెప్పినట్టు కచ్చితంగా ఇది కోర్టు ధిక్కారమేనని కొందరు అభిప్రాయపడుతుంటే..మరి కొందరు మాత్రం కాదంటున్నారు. నటుడు హీరో తమిళంలో చేసిన వ్యాఖ్యల్ని ఆంగ్లంలో అన్వయించుకోవడంతో వచ్చిన పొరపాటు వల్లనే జస్టిస్ సుబ్రహ్మణ్యం తీవ్రంగా స్పందించారని కొందరంటున్నారు. ఎందుకంటే నలుగురు విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విషాదమని..తన మనస్సును ఎంతగానే కలచివేసిందని సూర్య ట్విట్టర్ లో తెలిపారు. 


సూర్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌లో ‘‘అలాంటప్పుడు, నైతికత లేదు’’ అనే పదాలు లేవని, అన్వయించుకోవడంలో జడ్జి పొరపాటు పడి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. నటుడు సూర్యపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని..ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడ్డారని గుర్తు చేస్తున్నారు. ఒక దుర్ఘటనపై కళాకారుడి స్పందనను తీవ్రమైనదిగా పరిగణించరాదని ఆరుగురు మాజీ జడ్జీలు, కొందరు ప్రముఖ న్యాయవాదులు సైతం దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం గమనార్హం. Also read: Pawan Kalyan's Shivam: పవన్ కల్యాణ్, క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా ?