కొన్ని రోజుల కిందటే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచింది. అయితేనేం ఆమెకున్న క్రేజ్ కారణంగా వారం రోజుల్లోనే 2 మిలియన్ల ఫాలోయర్లను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. సినీ ఇండస్ట్రీకి పెద్ద కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన నటి తన చిన్ననాటి ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక అది మొదలుకుని ఆమె ఫాలోయర్లు ఈ పోస్టుకు లక్షల్లో లైక్స్ కొట్టారు. ఆ పోస్ట్ కామెంట్లు సైతం భారీగానే సొంతం చేసుకుంది. ఆమె ఎవరు గుర్తుపట్టారా మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆమె కూడా షూటింగ్‌ల నుంచి విరామం తీసుకుని ఇంటిదగ్గర ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో నటి కాలక్షేపం చేస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఓ సందేశాన్ని షేర్ చేశారు. ఎవరైనా తనతో కరచాలనం చేసేందుకు యత్నిస్తే.. ఇంటివద్ద ఉండండి, జాగ్రత్తగా ఉండాలి, ఇతరులకు కాస్త దూరంగా ఉండాలని సలహాలిచ్చారు. ఆ స్టార్ నటి మరెవరో కాదు బాలీవుడ్ బెబో కరీనా కపూర్. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల కుమారుడు తైమూర్ కూడా అచ్చం చిన్ననాటి కరీనాలాగే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here. 


భారీగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి