భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి యథాతథం

బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గతవారం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం మార్కెట్‌లో ట్రేడింగ్ అవుతున్నాయి

Last Updated : Mar 23, 2020, 06:57 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి యథాతథం

బంగారం ప్రేమికులకు మళ్లీ చేదువార్త. బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం మార్కెట్‌లో ట్రేడింగ్ అవుతున్నాయి. బుధవారం తగ్గిన బంగారం ధరలు మార్చి 17న అమాంతం పెరిగాయి. జ్యువెలర్ల విక్రయాలు పెరగడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో పసిడి ధరలు నేటి మార్కెట్‌లో పెరిగిపోయాయి. బంగారం ధరలు పెరిగినా వెండి ధరలలో ఏ మార్పు లేదు. పసిడి ధరలు పెరగడంతో నేడు బంగారు, వెండి కొనుగోళ్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?  

హైదరాబాద్ మార్కెట్‌లో మార్చి 19న (గురువారం) బంగారం 10 గ్రాముల ధర రూ.670 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.42,970కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర సైతం పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 690 పెరగడంతో 10గ్రాముల ధర రూ.39,390కి పెరిగింది.

UGC NET 2020 దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి 

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.41,450కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరగడంతో నలభై వేల మార్కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.40,250కి పెరిగింది.

See Pics: బుల్లితెర భామ టాప్ Bikini Photos

బంగారం ధరలు పెరిగినా డిమాండ్ లేకపోవడంతో వెండి ధరలు బుధవారం ధరలకే కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో నిన్న వెండి కేజీ ధర రికార్డు స్థాయిలో రూ.6,280 తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.41,780కు క్షీణించడం తెలిసిందే. మార్చి 19న సైతం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.41,780గానే కొనసాగుతూనే ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News