కరోనా వైరస్ (CoronaVirus) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 7వేల మంది ప్రాణాంతక కోవిడ్-19 (COVID-19) బారిన పడి చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జనాభాలో రెండో స్థానంలో ఉన్న  మన దేశంలో వాతావరణ పరిస్థితులు కారణంగా, ప్రభుత్వాలు, అధికారుల సలహాలు, సూచనల వల్ల కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. భారత్‌లో ఇద్దరు వ్యక్తులు చనిపోగా వారు విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?


కరోనా వైరస్ వ్యాప్తి అవుతుందన్న భయాలతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు ఇంటి వద్ద నుంచే పని చేయాలని (Work from Home) సూచించగా టాలీవుడ్ ‘మల్లీశ్వరీ’ కత్రినా కైఫ్ అది పాటిస్తున్నారు. ప్రజలకు తనవంతుగా అవగాహనా కల్పిస్తున్నారు. మన ఆరోగ్యం కోసం ప్రభుత్వం చెప్పినట్లుగా వినాలన్నారు కత్రినా కైఫ్.


See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా  



కొన్ని రోజుల వరకు సినిమా థియేటర్లు, విద్యా సంస్థలతోపాటు అన్ని జిమ్ సెంటర్లు సైతం మూతపడ్డాయి. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. జిమ్‌కు వెళ్లపోయినా సరే ఇంటి వద్ద ఇలా సులువుగా వర్కవుట్స్ చేయాంటూ కత్రినా కైఫ్ ఆన్‌లైన్ ట్విట్టర్ ఖాతా నుంచి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తన జిమ్ ట్రైనర్‌తో కలిసి వర్కవుట్స్ ఎలా చేయాలో చూపించారు. వీడియో చూసిన నెటిజన్లు మీరు ఆరోగ్యంగా ఉండాలి కత్రినా అంటూ ట్వీట్లు కామెంట్లు చేస్తున్నారు.


Photos: అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ 


కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..