బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. పలు చిత్రాల్లో నటించి, మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన మిస్టీ ముఖర్జీ శుక్రవారం ( అక్టోబర్ 2) రాత్రి మరణించారు. నటి కుటుంబ సభ్యుల ప్రకారం మిస్టీ చాలా కాలం నుంచి కీటో డైట్ ( Kito diet  ) పాటిస్తోంది. దీంతో ఆమె కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. చివరికి ఆమె ఊపిరి విడిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు


ఆమె బెంగళూరులో ( Bengaluru) తుది శ్వాస విడిచింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. మిస్టీ ముఖర్జీ తన తల్లి, తమ్ముడితో కలిసి నివసిస్తోంది. శనివారం ఉదయం కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య ఆమె పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


మిస్టీ తన జీవితాన్ని లైఫ్ కీ తో లగ్గయి ( Life Ki Toh Laggayi ) అనే చిత్రంతో ప్రారంభించింది. తరువాత పలు చిత్రాల్లో కనిపించి మంచి గుర్తింపు సాధించింది.


ఈ సంవత్సరం లోకాన్ని విడిచిన వారిలో మిస్టీ కూడా చేరారు. 2020లో ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్, సంగీత దర్శకుడు వాజీద్ ఖాన్, దిగ్గజ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) , కమీడియన్ జగ్దీప్, కొరియో గ్రాఫర్ సరోజ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఈ ప్రపంచాన్ని విచిడి వెళ్లారు.



ALSO READ| Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR