Tamannaah Bhatia: ఈడీ ముందు తమన్నా.. 8 గంటల విచారణ.. ఏం జరిగిందంటే..?
ED Grills Tamannaah Bhatia: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తాజాగా.. చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఈడి విచారణను ఎదుర్కొంటోంది తమన్నా.. దాదాపు 8 గంటల పాటు ఆమెను విచారించింది.ఇంతకు తమన్నా పై వచ్చిన ఆరోపణలు ఏంటి..? ఎందుకు తమన్నాను ఈడి ప్రశ్నిస్తోంది.. అనే విషయాలు అభిమానులలో కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ మేరకు తమన్నా భాటియా తాజాగా కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది.
Tamannaah Bhatia in money laundering case: ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా పేరు తెగ ట్రెండ్ అవుతోంది. దానికి ముఖ్య కారణం.. ఆమెను దాదాపు 8 గంటల పాటు ఈడీ.. విచారించడం. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా పేరు తెరపైకి రాగా..ఈమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గౌహతి కార్యాలయంలో.. నిన్న రాత్రి 8 గంటల పాటు విచారించారు. తమన్నాను నిందితురాలిగా విచారించలేదు.. కానీ ఈ మహాదేవ్ యాప్ కు అనుబంధ యాప్ అయిన HPZ టోకెన్ మొబైల్ యాప్ ను ప్రమోట్ చేయడంతో ఈమె కాస్త వార్తల్లో నిలిచింది..HPZ టోకెన్ యాప్ స్కామ్ లో తమన్నాను ప్రశ్నించడానికి ఈడీ పిలిపించినట్లు సమాచారం.
దీంతో తమన్నా గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. ఈమె వెంట తన తల్లి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమన్నాపై ఎలాంటి నేర ఆరోపణలు లేవు కానీ కేవలం యాప్ ను ప్రమోట్ చేసినందుకుగానే ఈడి విచారించినట్లు సమాచారం.
ఇకపోతే యాప్ ను ప్రమోట్ చేసినందుకు ఆమె కొంత డబ్బు కూడా తీసుకున్నారని, కానీ ఆమెపై ఎటువంటి నేరాలు లేవని సంబంధిత వర్గాలు కూడా తెలిపాయి. ఈ మేరకు తమన్నా నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మొబైల్ యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ల పేరుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఇలా ఈ యాప్ ను ప్రమోట్ చేసినందుకు తమన్నాను విచారించినట్లు సమాచారం.
కాగా ఈ యాప్ లో రూ.57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4000 ఇస్తామని చెప్పి కోట్లాదిమంది ప్రజలను మోసం చేశారని, షెల్ కంపెనీల పేరుతో వివిధ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి పెట్టుబడిదారుల నుంచి నగదు బదిలీ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను చూడడానికి కూడా ప్రచారం చేశారు.గేమింగ్ , బెట్టింగ్ అప్లికేషన్, సపోర్టింగ్ యాప్ లో ఐపీఎల్ మ్యాచ్లను చట్ట విరుద్ధంగా వీక్షించడానికి ప్రోత్సహించినట్లు తమన్న పై ఆరోపణలు రావడంతోనే ఆమెకు సామాన్లు జారీ చేసింది ఈ డి.. ఇక ఇందులో క్రికెట్ , పోకర్, బ్యాట్మెంటన్,టెన్నిస్, ఫుట్బాల్, కార్డు గేమ్ వంటి గేమ్లలో అక్రమ బెట్టింగులు పెట్టినట్లు సమాచారం
Also Read: OTT Releases: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, రేపు 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.