Flash Flood Warning: బంగాళాఖాతంలో వాయుగుండం ముప్పు తీవ్రమౌతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండటంతో దక్షిణ కోస్తా జీల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక జారీ అయింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు.
వాయుగుండం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్‌తో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీవ్ర అల్పపీడనం కాస్తా నిన్న అంటే మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రవైపుకు కదులుతోంది. రేపు పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా. ఈ క్రమంలో ఇవాళ, రేపు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఫలితంగా మెరుపు వరదలు సంభవించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రెండు రోజుల్నించి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.
అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు , మెరుపులతో వర్షం పడుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. కావలిలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చేశారు.
Also read: AP Rains Red Alert Areas: ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. స్కూల్లకు సైతం సెలవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.