బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్‌పై అంచనాలకు తగ్గట్టుగానే వివాదాలు కూడా ఉన్నాయి. రాముడి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సినిమాపై కోర్టు వివాదం ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ బడ్జెట్, భారీ అంచనాలతో, భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. దర్శకుడు ఓంరౌత్ తీస్తున్న ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం రాముడి జీవితం. టీజర్ విడుదల కాగానే సినిమాపై చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో వివాదం కూడా రేగుతోంది. టీజర్‌లో హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. టీజర్ సరిగ్గా లేదని..యానిమేషన్ సినిమాలా ఉందని ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్‌కు ఇప్పుడు కోర్టు వివాదం ఎదురైంది. అలహాబాద్ హైకోర్టులో ఈ సినిమా టీజర్ విషయంలో అభ్యంతరాలు దాఖలయ్యాయి. దాంతో ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివరణ కోరుతూ అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 


ఆదిపురుష్ సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు నోటీసులు అందాయి. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ లేకుండానే చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల చేశారనేది పిటీషన్ దారుడి వాదన. సీత పాత్రలో నటించిన కృతిసనన్ కాస్టూమ్స్‌పై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  ఈ పిటీషన్‌పై విచారణ ఫిబ్రవరి 21కు వాయిదా పడింది. 


వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో షూటింగ్ ప్రక్రియ ఆలస్యమై..ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త కోర్టు పంచాయితీలు ఎదుర్కోవడంతో ఎప్పుడు విడుదలవుతుందేది ఆసక్తిగా మారింది. 


Also read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook