Adivi Sesh:వాటిపైన వ్యామోహం లేదు.. అందుకే ఫ్రెండ్స్ నన్ను తిడతారు: అడివి శేషు
Adivi Sesh G2: వైవిద్యమైన కథలను ఎంచుకునే వారిలో అడివి శేషు ముందంజులో ఉంటారు. మొదటినుంచి వెరైటీ కథలను చేస్తూ అందరి అభిమానం సొంతం చేసుకుంటూ వచ్చాడు ఈ హీరో…
HBD Adivi Sesh: ఎన్నో వైవిద్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో అడివి శేషు. కథల సెలక్షన్ వల్లే దాదాపు ఈ హీరో వరసగా ఆరు హిట్లు అందుకున్నారు. ఇక హిట్ 2, మేజర్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత ప్రస్తుతం ఆయన కాస్త విరామం తీసుకున్నారు. ఈ హీరో దగ్గర నుంచి ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ప్రస్తుతం గూఢచారి-2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అడివి శేషు. అంతేకాకుండా శృతిహాసన్ తో #SeshExShruti అనే చిత్రంలో కూడా చేయబోతున్నారు. ఈరోజు (డిసెంబర్ 17న) అడివి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
ముందుగా తన నుంచి రాబోతున్న రెండు సినిమాల గురించి మాట్లాడుతూ..’2023 సంవత్సరం మొత్తం ప్రిపరేషన్‌లోనే గడిచింది. ‘గూఢచారి 2’తో పాటు శ్రుతి హాసన్‌తో కలిసి చేస్తున్న సినిమాకి రైటింగ్, ప్రిపరేషన్ ఇలా చాలా వర్క్ చేశాను. అందుకే ఈ సంవత్సరం నా దగ్గర నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. పేస్ బౌలర్స్ అందరికీ ఒకే స్పీడ్ ఉండదు కదా(నవ్వుతూ). ఒక్కో మనిషికి ఒక్కో స్పీడ్ ఉంటుంది. కానీ మనం చేసేది తప్పకుండా బాగుండాలి. అయితే మేజర్, హిట్ 2 బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్లు వచ్చే సంవత్సరం రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి’ అని చెప్పుకొచ్చారు శేష్.
కాగా మేజర్ సినిమాతో హిందీలో కూడా ఈ హీరో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా తన తదుపరి రాబోయే రెండు సినిమాలు సబ్జెక్ట్‌ను బట్టి హిందీలో విడుదల చేయాలా వద్ద అని ఆలోచిస్తానని శేష్ చెప్పారు. ‘జి2 చాలా పెద్ద సినిమా. ఈ చిత్రం ఐదు దేశాల్లో జరిగే కథ. ఆ స్థాయిలో ఉంది కాబట్టే హిందీ ఆడియన్స్ కచ్చితంగా నచ్చుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. శృతి హాసన్‌తో చేస్తున్న సినిమా హిందీ, తెలుగు రెండు భాషల్లో సెపరేట్‌గా షూట్ చేస్తున్నాం. ఎందుకంటే కల్చర్ ప్రకారం ప్రతి సీన్ ట్రీట్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగు, హిందీ రెండు భాషలపై పట్టున్న నటులని వేరువేరుగా ఎంపిక చేశాం’ అని అడివి శేష్ చెప్పుకొచ్చారు.
ఇక తన పర్సనల్ విషయాల గురించి చెబుతూ..’ఇండస్ట్రీలో డబ్బులైనా సంపాదించొచ్చు కానీ మంచి సినిమాలు చెయ్యడం మాత్రం చాలా అరుదుగా మనకి కుదిరే పని.. నాకు డబ్బు మీద పెద్ద వ్యామోహం లేదు. అందుకే నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఈ విషయంపై తిడతారు. కానీ నాకు సహజంగానే కేవలం మంచి సినిమాపైనే దృష్టి వెళ్లిపోతుంది. నా దృష్టి ఎప్పుడూ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఎలా ఫీలౌతారనే దానిపైనే ఉంటుంది. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా చాలా సెలక్టివ్ సినిమాలే చేస్తున్నాను’ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు ఈ హీరో.
Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు
Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి