Romantic Movie: యంగ్ హీరో ఆకాష్ పూరి(Akash Puri) నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) అందించారు. ఇక ఆకాశ్ సరసన కేతిక శర్మ(Ketika Sharma) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ చిత్రంలో రమ్యకృష్ణ(Actress Ramya Krishna) పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్


తాజాగా  ఈ సినిమా ట్రైలర్(Romantic Trailer) ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) లాంచ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ కు డార్లింగ్ విషెస్ చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు దీపావళికి మోక్షం కలగనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి