Akhanda Title Song: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం అఖండ (Akhanda Movie Title Song). ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో అఘోరాగా కనిపించిన బాలయ్య లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇటీవలే దీపావళి సందర్భంగా అఖండ మూవీకి (Akhanda Movie) సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ‘భమ్.. అఖండ’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య చాలా పవర్‌‌ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. 


తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం రత్నం డైలాగ్స్ అందించారు.


ఇక ఈ మూవీ కోసం నంద‌మూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించ‌నున్నారు. శ్రీకాంత్ (Srikanth) ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’ (Akhanda) కావడం వల్ల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Also Read: NCB Drug Case Update: ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో విచారణకు ఆర్యన్ ఖాన్ డుమ్మా


Also Read: Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook