NCB Drug Case Update: ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drug Case) భాగంగా విచారణకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎన్సీబీకి (Drugs Case NCB) చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. అయితే.. ఆదివారం (నవంబరు 7) విచారణకు ఆర్యన్‌ఖాన్ హాజరు కాలేదు. జ్వరం కారణంగా ఆర్యన్ హాజరు కాలేదని ఓ అధికారి తెలిపారు.
అక్టోబరు 3న క్రూయిజ్ షిప్లో రేవ్‌పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్‌ఖాన్‌ను (Aryan Khan’s Arrest) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు 22రోజులు జైలులోనే ఉన్నాడు. అతడి తరఫు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పుటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు.
ఆ తర్వాత అక్టోబరు 28న.. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి 14 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఆర్యన్‌కు వ్యక్తిగత నటి జుహీచావ్లా పూచీకత్తు ఇచ్చింది.
నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు (Nawab Malik on Aryan Khan case) చేశారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని తెలిపారు మాలిక్. దీనంతటికి సూత్రదారి బీజేపీ నేత మోహిత్ కాంబోజ్ అని ఆరోపించారు.
ఇది కిడ్నాప్ కేసు..
ఈ కేసు డ్రగ్స్‌కు సంబంధించింది కాదని.. కిడ్నాప్, డబ్బు డిమాండ్‌కు సంబంధించిందని (Aryan Khan Drugs case) పేర్కొన్నారు. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede), మోహిత్ కాంబోజ్ ఇద్దరూ డబ్బు డిమాండ్ చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. వాళ్లిద్దరికి ముందునుంచే సాన్నిహిత్యం ఉందన్నారు.
Also Read: Anushka Shetty New Movie: అనుష్క బర్త్డే సర్ ప్రైజ్.. యూవీ క్రియేషన్స్ తో కొత్త సినిమా ప్రకటన
Also Read: Janhvi kapoor: చెల్లెలి పుట్టినరోజున బార్బీగర్ల్‌గా ఆకట్టుకున్న జాన్ఙవి కపూర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి