Sunday Girlfriend Movie: సుమన్, అలీ, కామ్నా శర్మ ప్రధాన పాత్రల్లో సండే గర్ల్ ఫ్రెండ్ అనే తెరకెక్కనుంది. ఈ సినిమాకు గడ్డం వెంకటరమణా రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. లార్విన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. లవ్ అండ్ ఎంటర్‌టైనర్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాకు గడ్డం వెంకటరమణా రెడ్డి దర్శకత్వం వహించడంతోపాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, లిరిక్స్  అందిస్తుండడం విశేషం. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సుమన్, ఇంద్రజ, అలీ అతిథులుగా హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..   


ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ నిచ్చారు. సుమన్ స్క్రిప్ట్ అందజేయగా.. ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ గడ్డం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం సీఎం పెళ్లాం అనే సినిమాను రూపొందిస్తున్నానని చెప్పారు. ఆ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంటుందన్నారు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. సండే గర్ల్‌ఫ్రెండ్ సినిమా అదే జానర్‌లో కాకుండా పూర్తిగా నేటి ట్రెండ్ లవ్ స్టోరీతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ట్రెండీ లిరిక్స్‌తో సాంగ్స్ కంపోజిషన్‌తో ఉంటాయని తెలిపారు. సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయిందని.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.


అనంతరం హీరోయిన్ కామ్నా శర్మ మాట్లాడుతూ.. తాను ముంబై నుంచి వచ్చానని.. సండే గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండడం ఆనందంగా ఉందన్నారు. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆదరించారని.. తనకు కూడా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. 


యాక్టర్స్- కామ్నా శర్మ, సుమన్, అలీ, ఘర్షణ శ్రీనివాస్, షాలినీ నాయుడు తదితరులు


టెక్నికల్ టీమ్


==> బ్యానర్ - లార్విన్ మూవీస్
==> కెమెరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నాగ శ్రీనివాసరెడ్డి
==> ఎడిటర్ - రామారావు
==> మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
==> PRO- సురేష్ కొండేటి
==> స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, దర్శకత్వం- గడ్డం వెంకటరమణ రెడ్డి


Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.