రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పుడు అలియా భట్ పారితోషికం చర్చనీయాంశమవుతోంది. కేవలం 15 నిమిషాలకోసం ఆమె తీసుకున్న పారితోషికం నోరెళ్లబెడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలితో(Bahubali) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో జనవరి 7న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి రోజుకో అప్‌డేట్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకు ప్రేక్షకులకు విశేష స్పందన లభిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సంచలనంగా మారుతోంది. ఇప్పుడీ మూవీలో నటించిన బాలీవుడ్ నటి అలియా భట్ పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటో చూద్దాం.


ఆర్ఆర్ఆర్ చిత్రంలో(RRR Movie) అలియా భట్ పదిరోజుల కాల్‌షీట్‌లో పాల్గొంది. మొత్తం సినిమాలో ఆమె కన్పించేది కేవలం 15 నిమిషాలు మాత్రమే. కేవలం 15 నిమిషాల వ్యవధి కోసం ఆమె 5-6 కోట్ల పారితోషికం అడిగిందనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ మార్కెట్ కోసం అలియా భట్(Alia Bhatt) తప్పనిసరి అని రాజమౌళి చెప్పడంతో ఆమె కోరిన పారితోషికం ఇచ్చేందుకు ఓకే అనేశారు నిర్మాతలు. అలియా భట్‌కు అంత పారితోషికం అవసరమా అనే చర్చ నడుస్తోందిప్పుడు. అయితే అలియా భట్ స్థాయికి ఆ మాత్రం ఉండాలనేది మరికొందరి వాదన. బాలీవుడ్‌లో అలియా భట్ ఒక్కొక్క సినిమాకు 10-12 కోట్ల తీసుకుంటోంది. 2-3 నెలల కాల్‌షీట్‌కు 10-12 కోట్లు తీసుకున్న అలియా భట్..10 రోజల కాల్‌షీట్‌కు 5-6 కోట్లు సమంజసం కాదనేది మరో వాదనగా ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), రామ్‌చరణ్‌లు(Ramcharan)చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్ని పోషిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కన్పించనున్నాడు. 


Also read: The Ghost: కాజల్‌, అమలా కాదు.. నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook