MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మద్య రేపు జరగనున్న మా ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేనంత చర్చనీయాంశమయ్యాయి. మా ఎన్నికలు. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. ప్రకాశ్‌ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.


అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు(MAA Elections)రేపు జరగనున్నాయి. రేపు జరగనున్న మా ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో రేపు ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మా ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు గదుల్ని ఏర్పాటు చేశారు. మూడు గదుల్లో కలిపి 12 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒకేసారి ఒక గదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలీసుల బందోబస్తు కోసం మూడు ప్లటూన్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో మహిళా విభాగం కూడా ఉంది. మా ఎన్నికల్లో మొత్తంత 883 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అటు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్(Prakash Raj Pannel), ఇటు మంచు విష్ణు ప్యానెల్(Manchu Vishnu Pannel) ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులతో ఓటింగ్ జరగనున్న ప్రాంతంలో సమావేశమయ్యారు. 


Also read: Heroin Smuggling: హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఏపీకు సంబంధం లేదని నిర్ధారించిన డీఆర్ఐ నివేదిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook