Heroin Smuggling: హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఏపీకు సంబంధం లేదని నిర్ధారించిన డీఆర్ఐ నివేదిక

Heroin Smuggling: దేశంలో హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు కీలకం అనేది డీఆర్ఐ నివేదిక తేల్చేసింది. చేసిన విచారణ నివేదికను ఎన్ఐఏకు అప్పగించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2021, 11:18 AM IST
  • హెరాయిన్ స్మగ్లింగ్ కేసు డీఆర్ఐ విచారణలో కీలక విషయాలు
  • ఢిల్లీకు చెందిన కుల్దీప్ సింగ్ కింగ్ పిన్ గా నిర్ధారణ
  • ఏపీకు హెరాయిన్ కేసుతో సంబంధం లేదని డీఆర్ఐ నివేదిక
Heroin Smuggling: హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఏపీకు సంబంధం లేదని నిర్ధారించిన డీఆర్ఐ నివేదిక

Heroin Smuggling: దేశంలో హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు కీలకం అనేది డీఆర్ఐ నివేదిక తేల్చేసింది. చేసిన విచారణ నివేదికను ఎన్ఐఏకు అప్పగించింది.

టాల్కం పౌడర్ పేరుతో ఆప్ఘనిస్తాన్(Afghanistan)నుంచి గుజరాత్‌కు 21 వేలకోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ కీలక ప్రగతి సాధించింది. ఢిల్లీకు చెందిన కుల్దీప్‌సింగ్ ఈ డ్రగ్స్ రాకెట్‌లో కీలక సూత్రధారి అని డీఆర్ఐ నివేదిక తేల్చింది. చెన్నైకు చెందిన దంపతులకు కమీషన్ ఎరగా వేసి స్మగ్లింగ్ దందా నడిపినట్టు డీఆర్ఐ(DRI)నిర్ధారించింది. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠా గత కొద్దికాలంగా అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ దందా కొనసాగిస్తోంది. హెరాయిన్ స్మగ్లింక్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించడంతో డీఆర్ఐ తన నివేదికను ఎన్ఐఏకు అప్పగించింది.

చెన్నైకు చెందిన దంపతులతో పాటు ఆరుగురు ఆప్ఘన్ జాతీయులు, ఉజ్బెకిస్తాన్ మహిళ కాల్‌డేటా, వాట్సప్ చాటింగ్, మెయిల్స్‌ను డీఆర్ఐ పరిశీలించింది. కుల్దీప్‌సింగ్ పేరుతో ఢిల్లీ నుంచి ఓ డాన్ స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా డ్రగ్స్ దందాలో పాత్ర పోషించినట్టు డీఆర్ఐ అంచనా. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కుల్దీప్‌సింగ్ ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం వ్యవహారమంతా చాటింగ్ ద్వారా నడిపించాడు. ఆప్ఘనిస్తాన్ డ్రగ్స్ డీలర్ హాసన్ హుస్సేన్, చెన్నైకు చెందిన సుధాకర్ మధ్య వాట్సప్ చాటింగ్‌తోనే ఈ కేసులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. చెన్నైకు చెందిన దంపతులు లక్షలు కమీషన్‌గా తీసుకుంటూ ఆషీ ట్రేడింగ్ కంపెనీను ఫ్రంట్ ఆఫీసుగా వాడుకునేందుకు అనుమతించింది.హెరాయిన్ స్మగ్లింగ్‌తో(Heroin Smuggling)విజయవాడకుగానీ, ఏపీకు గానీ నేరుగా ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఏపీకు అసలు హెరాయిన్ రాలేదని వెల్లడైంది. 

Also read: Cyclone at Bay of Bengal: కోస్తాంధ్ర తీరానికి తుపాను హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News