Allu studios inauguration: అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి.. అల్లు స్టూడియో నిర్మాణం
అక్టోబర్ 1 హాస్య నటుడు డా. అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ( Allu Aravind family members ) ఆయనకు ఘన నివాళి అర్పించారు. అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం అల్లు స్టూడియోస్‌ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని గండిపేట ( Allu Studios in Hyderabad ) ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫిల్మ్ స్టూడియోస్ నిర్మించబోతున్నారు.
అక్టోబర్ 1 హాస్య నటుడు డా. అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ( Allu Aravind family members ) ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ ప్రత్యేక వేడుకను పురస్కరించుకుని, అల్లు వారి కుటుంబం ఈ రోజు సోషల్ మీడియా ఆధారంగా ఒక ప్రత్యేక ప్రకటనను చేశారు.
అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం అల్లు స్టూడియోస్‌ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని గండిపేట ( Allu Studios in Hyderabad ) ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫిల్మ్ స్టూడియోస్ నిర్మించబోతున్నారు. ఈ స్టూడియోను అత్యాధునిక సాంకేతిక హంగులతో, ఉత్తమ సౌకర్యాలతో నిర్మించబోతున్నారు. Also read : Kangana Ranaut: 7నెలల తర్వాత.. తలైవిగా కెమెరా ముందుకు క్వీన్
అల్లు స్టూడియోస్‌ను అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ( Allu Ramalingaiah memorial ) అంకితమిస్తున్నామని అల్లు అరవింద్ కుటుంబం ప్రకటించింది. తమ కుటుంబం మొత్తానికి సినిమా అంటే ప్రాణమని, తమకు ఆనందాన్నిచ్చేది సినిమానే అని స్పష్టం చేశారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామని అల్లు అరవింద్ అతని కుమారులు బాబీ అల్లు, అల్లు అర్జున్ ( Allu Arjun ), అల్లు శిరీష్‌లు ( Allu Sirish ) కలిసి ఈ ప్రత్యేక ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ స్టూడియోకి సంబంధించి ప్రణాళికలు జరుగుతున్నాయి. అలాగే త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. Also read : Vijay Deverakonda: సౌతిండియాలో ఒకే ఒక్కడు.. విజయ్ దేవరకొండ