Kangana Ranaut: 7నెలల తర్వాత.. త‌లైవిగా కెమెరా ముందుకు క్వీన్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్‌ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.

Last Updated : Oct 1, 2020, 02:56 PM IST
Kangana Ranaut: 7నెలల తర్వాత.. త‌లైవిగా కెమెరా ముందుకు క్వీన్

Kangana Ranaut back to work after 7 months: న్యూఢిల్లీ‌: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్‌ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్‌లో డ్రగ్స్ దందాతోపాటు... పలువురు నాయకులపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుపడింది కంగనా రనౌత్. అయితే కరోనా కారణంగా దాదాపు 7నెలల నుంచి కెమెరా ముందుకు రాని బాలీవుడ్ స్టార్ నటి కంగ‌నా ర‌నౌత్.. మ‌ళ్లీ త‌న ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్‌ను మొదలు పెట్టింది. ఈ మేరకు కంగనా రనౌత్ గురువారం ఉదయం దిగిన ఫొటోలతో ట్విట్ చేసింది.

ఈ మేరకు కంగనా ఇలా రాసింది.. ‘‘మిత్రులారా ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు.. దాదాపు ఏడు నెల‌ల త‌ర్వాత ఫిల్మ్ షూటింగ్ ప‌నులను ప్రారంభిస్తున్నాను. నా అత్యంత ప్రతిష్టాత్మక ద్విభాషా ప్రాజెక్ట్ తలైవి కోసం దక్షిణ భారతదేశానికి వెళ్తున్నాను.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో నాకు మీ ఆశీర్వాదం కావాలి’’ అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. Also read: Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రంలో కంగ‌నా ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. నటిగా ఆతర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించిన జయలలిత 2016 డిసెంబర్ 5 న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె బయోపిక్‌ను తెలుగు, తమిళం, హింది భాషల్లో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. కావున ఈ తలైవి చిత్రం షూటింగ్ కోసం 7నెలల తర్వాత కంగనా రనౌత్ కెమెరా ముందుకు రానుంది.  Also read : Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x