Vijay Deverakonda: సౌతిండియాలో ఒకే ఒక్కడు.. విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. సౌతిండియాలో ఏ హీరోకు లేని విధంగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ( Vijay Deverakonda on instagram ) 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ సొంతం చేసుకుని ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ మైలురాయిని అందుకున్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలవడం విశేషం.

Last Updated : Oct 1, 2020, 09:01 AM IST
Vijay Deverakonda: సౌతిండియాలో ఒకే ఒక్కడు.. విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ఫ్యాన్ ఫాలోయింగ్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. సౌతిండియాలో ఏ హీరోకు లేని విధంగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ( Vijay Deverakonda on instagram ) 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ సొంతం చేసుకుని ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ మైలురాయిని అందుకున్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలవడం విశేషం. ఆ తర్వాత 8.7 మిలియన్ల ఫాలోవర్స్‌తో అతి సమీపంలో మళ్లీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ఉన్నాడు. ఇటీవల కాలంలో బ్యాక్-టు-బ్యాక్ ప్యాన్-ఇండియా సినిమాలకు సైన్ చేయడంలో బిజీగా ఉన్న యంగ్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌‌లో పెరుగుతోందడానికి ఇదే నిదర్శనం. Also read : Bigg Boss 3 payment: బిగ్ బాస్ 3 పారితోషికం ఇంకా రాలేదంటున్న హీరోయిన్

 Vijay-Devarakonda-gets-9-million-followers-on-instagram-account-page

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన మొదటి ప్యాన్-ఇండియన్ సినిమా ఫైటర్ మూవీతో ( Fighter movie ) బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాధ్ ( Puri Jagannadh ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్ నటి చార్మీ కౌర్ కూడా పాల్పంచుకుంటుండగా.. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటి అనన్యా పాండే ( Actress Ananya Pandey ) జంటగా నటిస్తోంది. 

విజయ్ దేవరకొండ ఇటీవలే మరో ప్యాన్-ఇండియన్ మూవీకి సైన్ చేశాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన సుకుమార్ ( Director Sukumar ) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇక సుకుమార్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే... ప్రస్తుత సుక్కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాతో ( Pushpa movie ) బిజీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియా విడుదల కానున్న ఈ సినిమా పూర్తి కాగానే.. సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమాపై దృష్టిసారించనున్నాడని సమాచారం. Also read : Chiranjeevi requests Rajamouli: రాజమౌళికి చిరంజీవి రిక్వెస్ట్ !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News