Allu Arjun Wax Statue in Madame Tussauds Dubai: 'పుష్ప' సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు అల్లు అర్జున్. పుష్పలో బన్నీ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు అంటూ ఎవ్వరూ ఉండరు. పుష్పరాజ్ తన నటనతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకున్నాడు అల్లు అర్జున్.  ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారట. ఈ ఏడాది చివరిలోనే ఈ విగ్రహాన్ని పెట్టనున్నట్లు మేడమ్ టుస్సాడ్స్ ట్వీట్ చేసింది. అక్కడ స్టాచ్యూ ఉన్న తొలి తెలుగు నటుడిగా బన్నీ సరికొత్త రికార్డును క్రియేట్ చేయనున్నాడు. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’ నిర్వాహకులు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ బ్లాక్ సూట్ ధరించి సందడి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది ప్రారంభంలోనే దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులను అల్లు అర్జున్ కలిశాడు. అతని స్టాచ్యూ కోసం ఏకంగా 200 కొలతలు తీసుకోవడం విశేషం. టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఇది తనకు గర్వకారణమని అన్నాడు. తాను చిన్నతనంలో ఈ మ్యూజియానికి వెళ్లానని.. అలాంటిది ఇందులో నా విగ్రహాన్ని చూస్తానని ఎప్పుడూ ఊహించనే లేదని బన్నీ ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటికే దుబాయ్ లోని మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్ వంటి సినీ ప్రముఖలు విగ్రహాలు ఉన్నాయి. 



ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2 నటిస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప ది రూల్ లో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ మూవీ ఆగస్టు 15, 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. 


Also Read: Hai Nanna Song: నాని 'గాజు బొమ్మ' సాంగ్ పై మహేష్ ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook