Hai Nanna Song: నాని 'గాజు బొమ్మ' సాంగ్ పై మహేష్ ప్రశంసలు

Hai Nanna Movie: నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' మూవీ నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. గాజుబొమ్మ అంటూ సాగే ఈ పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 08:26 PM IST
Hai Nanna Song: నాని 'గాజు బొమ్మ' సాంగ్ పై మహేష్ ప్రశంసలు

Hai Nanna Gaaju Bomma Song: నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ 'హాయ్ నాన్న'. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ మూవీ ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా నటించింది. ఇప్పటికే రిలీజైన పోసర్ట్స్, ఫస్ట్ సాంగ్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. జెర్సీ తర్వాత నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు.

తాజాగా రెండో పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. 'ఈ సాంగ్ నన్ను కదిలించినట్లే ప్రతి తండ్రిని హత్తుకుంటోంది.  హాయ్ నాన్న మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు మహేశ్. ఈ సాంగ్ చాలా ఎమోషనల్ గా సాగుతోంది. తండ్రీ కూతుళ్లు మధ్య భావోద్వేగాలను ఈ పాటలో చక్కగా చూపించారు మేకర్స్. గాజుబొమ్మ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సూపర్ అనే చెప్పాలి. ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా  డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దసరా తర్వాత నాని చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. 

Also Read: Mister Pregnant OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News