Loss for Aha OTT: మొట్టమొదటి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా పేరుపొందిన ఆహా సంస్థని అల్లు ఫ్యామిలీ స్థాపించింది. ఇందులో ఎన్నో కొత్త చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లను కూడా స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నో రకాల షోలు చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. కరోనా సమయంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకొని భారీగానే యూజర్స్ ని సంపాదించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తోనే ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇచ్చే విధంగా ఆహా పేరు.. సంపాదించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా నష్టాల బాట పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ  ఆహా కి సుమారుగా రూ.105 కోట్ల మేరా నష్టం వచ్చినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. 


ఆహా కార్యక్రమాల వల్ల వస్తున్నటువంటి ఆదాయం రూ.133 కోట్లు అవ్వగా.. ఇవే కాకుండా ఇతరత్రా ఆదాయల ద్వారా రూ .4కోట్లను సంపాదించింది అని,  మొత్తం మీద రూ.137 కోట్ల వరకు వచ్చింది అని తెలిపింది. కానీ ఖర్చు మాత్రం రూ .207 కోట్లు తేలింది అని , దీని ఫలితంగానే రూ.105 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లుగా తెలియజేసిందట.


కానీ ఆహా పనితీరు గతంలో ఉన్న వాటికంటే ప్రస్తుతం చాలా మెరుగుపడిందని చెప్పవచ్చు..2022-23 లో వచ్చిన ఆదాయం తో  పోల్చితే 2023-24 లో ఆదాయం తొమ్మిది శాతం మేరా ఎక్కువగా వచ్చినట్లు తెలియజేస్తుంది. అప్పుడు రూ .122 కోట్లు ఆదాయం రాగా ..ఇప్పుడు రూ.137 కోట్లు వచ్చిందని తెలుపుతోంది. ఇక ఆహాకు 2022-23 లో నష్టాలు రూ.120 కోట్లు అని, ఇప్పుడు వాటిని రూ .105 కోట్ల మేరకు తగ్గింది అని తెలిపారు. 


ప్రస్తుతం ఆహా తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా పలు రకాల కార్యక్రమాలను ప్రారంభించారు. ఓటీటీ ప్లాట్ఫారం గా బాగానే పేరు సంపాదించినా నిర్వహణ ఖర్చుల వల్ల నష్టాలు వస్తున్నాయట. అలా ఇప్పుడు రూ.105 కోట్ల మీద నష్టం వచ్చినట్లు సమాచారం.


Read more: Amrapali Kata: ఏపీ సర్కారుకు బిగ్ ట్విస్ట్.. సెలవులపై వెళ్లిపోయిన ఆమ్రపాలీ కాట.. ఎందుకో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.