Ram Charan at Ambani Wedding: ప్రస్తుతం దేశవ్యాప్తంగా   ఎక్కడ చూసినా సరే అంబానీ పెళ్లి వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు.అంగరంగ వైభవంగా.. ఆకాశమంత పందిరి వేసి,  చరిత్ర సృష్టించేలా అంబానీ తన చిన్న కొడుకు అనంత అంబానీ వివాహాన్ని జరిపిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్ మాగ్నెట్లను మొదలుకొని.. సినీ తారలను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఇక బాలీవుడ్ స్టార్స్.. అంతా కూడా ఈ వేడుకలలో జంటలుగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక పలువురు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులను కూడా అంబానీ తమ ఇంట పెళ్లి వేడుకలకు ఆహ్వానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ వేడుకల్లో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కి ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది.. ఇక అసలు విషయంలోకెళితే టాలీవుడ్ నుండి కేవలం మెగా కుటుంబానికి మాత్రమే వివాహానికి ఆహ్వాన పత్రిక లభించింది.. అందులో భాగంగానే రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనతో పాటు వారి కూతురు క్లీంకారా కూడా అంబానీ ఇంట పెళ్లి వేడుకలలో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ముంబైలో వివాహానికి హాజరైన ఉపాసన , రాంచరణ్ తిరిగి హైదరాబాదు ఎయిర్పోర్టులో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 



అయితే టాలీవుడ్ లో ఇంత మంది పాన్ ఇండియా స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం లభించడంతో అల్లు అర్జున్ అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారు.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈయనకు మాత్రం ఆహ్వాన పత్రిక లభించలేదు. మరొకవైపు టాలీవుడ్లో అల్లు వర్సెస్ మెగా అంటూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అంత పెద్ద వివాహానికి మెగా వారసుడికి మాత్రమే ఆహ్వాన పత్రిక లభించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇక కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ విచ్చేసి ఈ వేడుకలలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు .


ఏమైనా అల్లు అర్జున్ కి ఆహ్వాన పత్రిక అందకపోవడం ఇంతకంటే అవమానం మరొకటి లేదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు మెగా అభిమానులు కూడా దీనిపై రకరకాలుగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. ఇక అల్లు అర్జున్ ఇటీవలే నేషనల్ అవార్డ్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇంతటి గొప్ప నటుడికి ఆహ్వానం లభించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.


Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!


Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి