Pushpa Movie Second Song: ఇప్పటి వరకు అల్లు అర్జున్- సుకుమార్ (Allu Arjun- Sukumar combo) కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా 'పుష్ప' (Pushpa). రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.  ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో ఒక బజ్ క్రియేట్ చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్ విదులైన తరువాత అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. 


Also Read: Mahesh Koneru passed away: మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం


ఈ సినిమాకు చెందిన మొదటి భాగం ఏపీలోని (AP) మారేడు మిల్లి అడువుల్లో (Maredu Milli Forest) పూర్తవ్వగా.. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి సంబందించిన రెండో పాటను అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన టీమ్, ఈ రెండో పాటకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. "చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.." (Chupe Bangaramayye Srivalli) అంటూ సాగే ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడారు. చంద్రబోస్ (Chandra Bose) రాసిన ఈ గీతం మరో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. 




మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ (Mytri Movie Makers Banner) పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాకుండా యాంకర్ అనసూయ (Anchor Anasuya), సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 


Also Read: MAA Elections : నా రాజీనామాకి కారణాలను త్వరలోనే చెప్తా‌‌- ప్రకాశ్‌రాజ్‌



ఆగష్ట్ 11 వ తేదీన విడుదలైన 'దాక్కో దాక్కో మేక' (Dakko Dakko Meka) మొదటి సాంగ్ లో ఊర మాస్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ 'తగ్గేదే లే' (Thaggedele) డైలాగ్ ఇప్పటికే చాలా ఫేమస్ అయిందన్న విషయం అందరికి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరియు తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 17న  ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి