Allu Arjun, Rashmika Mandanna's Pushpa The Rise Movie trailer announcement Tomorrow : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచీ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో బన్నీ (Bunny) ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఏ మూవీలో నటించని విధంగా పుష్పలో వినూత్నంగా నటించారు బన్నీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బన్నీ పుష్ప రాజ్ (Pushpa Raj) పాత్రలో అదరగొట్టారని తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో సాగుతుందని సమాచారం. బన్నీఈ మూవీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ (Smuggling red sandalwood) చేసే లారీ డ్రైవర్ (Lorry driver) పాత్రలో నటిస్తున్నాడని టాక్. 


ఇక పుష్ప మూవీ నుంచి ఇప్పటికే పలు క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు అందరి ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. పుష్ప ది రైజ్ (Pushpa - The Rise) అనే టైటిల్‌ తో రానుంది. 


Also Read : Shiva Shankar Master passes away : డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్‌ ఇకలేరు


పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బన్నీ (Bunny) సరసన రష్మిక మందన్న (Rashmika) జత కట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 



 



 


ఇక పుష్ప మూవీ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ (Crazy update) వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. పుష్ప పార్ట్ వన్.. ట్రైలర్‌‌ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన అప్‌డేట్ రేపు అంటే నవంబర్ 29న 11 గంటల 7 నిమిషాలకు రానుంది. డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్‌ (Trailer‌) రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.


Also Read : Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్​- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook