Allu Arjun Unblocked Bhanu Sri Mehta వరుడు సినిమాను బన్నీ అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా మరిచిపోరు.  సినిమాకు ఇచ్చిన ఎలివేషన్స్.. పెంచిన ఎక్స్‌పెక్టేషన్‌కు ఏ మాత్రం రీచ్ కాలేక చతికిలపడిపోయింది. ఇక హీరోయిన్‌ను ఇంట్రవెల్ వరకు చూపించకపోవడం, సినిమా పోస్టర్లలోనూ ఎక్కడా చూపించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగా హీరోయిన్‌ లేకపోవడంతో సినిమా మరింతగా డిజాస్టర్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుడు సినిమా డిజాస్టర్ అవ్వడంతో హీరోయిన్‌తో పాటు దర్శకుడు గుణ శేఖర్ అడ్రస్ కూడా గల్లంతయింది. అయితే గుణ శేఖర్ టేకింగ్, మేకింగ్ ఎలా ఉన్నా.. మణిశర్మ అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఈ సినిమాతోనే ఆర్య విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇన్నాళ్లకు వరుడు హీరోయిన్‌ వార్తల్లో నిలిచింది.


సినిమాల్లో నటించిన దానికంటే ఎక్కువ క్రేజ్, ఫేమ్ ఈరోజు వచ్చింది. ట్విట్టర్‌లో బన్నీ తనను బ్లాక్ చేశాడంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేసింది భాను శ్రీ మెహతా. అసలే హీరోల అకౌంట్లను వేరే టీం మెయింటైన్ చేస్తుంటుంది. ఇది బన్నీకి తెలిసి జరిగిందో.. తెలియక జరిగిందో.. గానీ ఆమె మాత్రం బాగానే హర్ట్ అయినట్టుంది. బన్నీ తన అకౌంట్‌ను బ్లాక్ చేశాడంటూ వాపోయింది. బన్నీతో నటించిన వరుడు తరువాత తనకు అవకాశాలు రాకుండాపోయాయ్ అని చెప్పుకొచ్చింది.


 



ఇక బన్నీని ఇలా టార్గెట్ చేసినట్టుగా అనిపించడంతో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. భాను శ్రీని ట్రోల్ చేశారు. నువ్ ఎక్కువగా విసిగిస్తూ ఉండి ఉంటావ్.. అందుకే ఇలా బ్లాక్ చేశాడంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. తాను ఎప్పుడూ కూడా తన ఫెయిల్యూర్‌కి, తన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం బన్నీ అని చెప్పలేదంటూ భాను శ్రీ వాపోయింది. అయితే ఇప్పుడు బన్నీ మాత్రం భానుశ్రీని కరుణించాడు. కాస్త వెనక్కి త్గగాడు. మళ్లీ భాను శ్రీని బ్లాక్ లిస్ట్‌లోంచి తీసేశాడట. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. బన్నీ తనను అన్ బ్లాక్ చేయడంతో భాను శ్రీ గాల్లో తేలిపోతోంది.


Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్


Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook