Allu Sneha Reddy Selfie Got Viral: అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య ఫోటో షూట్లతో హీట్ పెంచేస్తోన్న సంగతి తెలిసిందే. స్నేహా రెడ్డి కోసం ప్రీతమ్ జుకల్కర్ స్పెషల్ దుస్తులను డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మిర్రర్ సెల్ఫీలతో అల్లు స్నేహా రెడ్డి అదరగొట్టేసింది. ఇంకా ఎవరికి ఇలా మిర్రర్ సెల్ఫీలు దిగడం అంటే ఇష్టం అని అడుగుతూ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో స్నేహా రెడ్డి ధరించిన దుస్తులు చూస్తే అంతా నోరెళ్లబెట్టేయాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే స్నేహా రెడ్డి ఇప్పుడు వెరైటీ ఫోటో షూట్లు చేస్తోంది. అందాల ప్రదర్శనకు తెరదీస్తోంది. అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో.. ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. బన్నీకి సంబంధించిన విశేషాలు, అర్హ, అయాన్‌లకు సంబంధించిన స్టోరీలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక గత కొన్ని వారాల నుంచి బన్నీ, స్నేహా రెడ్డిలు వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.



ఆఫ్రికా అడవులు, రాజస్థాన్ నేషనల్ పార్కులు అంటూ తిరుగుతూ పులులు, సింహాలు, జింకల మధ్య తిరిగారు. ఇక మొన్న జరిగిన స్నేహా రెడ్డి బన్నీల వివాహా వార్షికోత్సవానికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన భార్యకు స్పెషల్‌గా విషెస్ చెప్పాడు బన్నీ. క్యూటీ అంటూ సంబోధిస్తూ భార్య ప్రేమను కురిపించాడు.


స్నేహా రెడ్డికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సౌత్‌ మొత్తంలో హీరోల భార్యలందరిలోనూ స్నేహా రెడ్డి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. అందరి కంటే ఎక్కువగా ఇన్ స్టాగ్రాం ఫాలోవర్లున్న సెలెబ్రిటీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఆమె ఖాతాకు 8.8M ఫాలోవర్లున్నారు. స్టార్ హీరోలకు సైతం ఈ రేంజ్ ఫాలోవర్లు లేకపోవడం విశేషం.


Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్


Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook