ఎప్పుడేపుడా అని ఎదురుస్తున్న అల్లు అర్జున్- సుకుమార్ (Allu Arjun- Sukumar) సినిమా 'పుష్ప' సినిమాలో 'దాక్కో దాక్కో మేక' సాంగ్ విడుదలైంది.  
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో ఒక బజ్ క్రియేట్ చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్ విదులైన తరువాత అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Prabhas photos leaked: సలార్ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ప్రభాస్ ఫోటోలు, వీడియోలు.. ట్విటర్‌లో వైరల్


ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు. 
5 భాషల్లో విదులైన ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది, అడవి ప్రాంతంలో స్మగ్లింగ్ నేపద్యంలో సాగే ఈ పాటలో అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ సినిమా పై ఆసక్తిని మరింత పెంచాయి. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట పల్లె నేపథ్యంలో సాగగా అందరిని గ్రామీణ అలవాట్లు అబ్బుర పరుస్తున్నాయి.


"వెలుతురూ తింటది ఆకు.. 
ఆకుని తింటది మేక..
మేకని తింటది పులి..
ఇది కదరా ఆకలి...........
పులిని తింటది చావు..
చావుని తింటది కాలం.. 
కాలాన్ని తింటది ఖాళీ.. 
ఇది మహా ఆకలి...
వెటాడేది ఒకటి... పరిగేత్తేది ఇంకోటి...
దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..
ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు పోయిందే..
హేయ్! "దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుకుద్ది పీక"
అంటూ సాగే ఈ పాటలో పూర్తిగా ప్రతి జీవికి చెందిన జీవన చక్రం గురించి తెలుపబడింది. 



 


Also Read: Viral Photo: 'తలా' విత్ 'దళపతి'.. గంటల్లోనే వైరల్ అయిన ఫోటో!


మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాకుండా యాంకర్ అనసూయ, సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook