Allu Arjun`s Pushpa: పుష్ప లాంటి సినిమాలు 1990లలోనే చేశా
Mithun Chakraborty Comments on Pushpa Movie: వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి.. ఇప్పడు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లోకి అడుగుపెట్టారు. ఇక పుష్పలాంటి మూవీలను తాను ఎప్పుడో చేసేశాను అని మిథున్ అంటున్నారు.
Mithun Chakraborty Likes Pushpa Movie: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్న బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేసే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మిథున్ చక్రవర్తి కనిపించనున్నారు.
బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్‌లో మిథున్ చక్రవర్తితో పాటు శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా కూడా కనిపించనున్నారు. ఈ సిరీస్‌లో రైటర్ తాహిర్ వజీర్‌గా అర్జన్ బజ్వా... అతని ఫ్యాన్‌గా శ్రుతి హాసన్ నటించింది. ఫిబ్రవరి 18 నుంచి బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానున్న సందర్భంలో మిథున్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎలా మారిపోయిందనే విషయాలతో పాటు అల్లు అర్జున్ పుష్ప మూవీ తనకు ఎంతలా నచ్చిందనే విషయం వరకూ ప్రతీది మిథున్ చక్రవర్తి చెప్పుకొచ్చారు.
తన 45 ఏళ్ల కెరీర్‌లో 350 చిత్రాలకు పైగా చేసిన మిథున్ చక్రవర్తి ఇప్పుడు ఒటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి అరంగేట్రం చేస్తున్నారు. మరి ఈ అరంగేట్రం ఎలా ఉందని అడగ్గా.. తాను తన వద్దకు వచ్చిన ప్రాజెక్ట్ చేశానని.. అందులో నటుడిగా తన క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేశానని మిథున్ చక్రవర్తి చెప్పుకొచ్చారు.
అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నటించడం వల్ల తనకు ఏమీ వ్యత్యాసం కనిపించలేదన్నారు. ప్లాట్‌ఫామ్ ఒక్కటే వేరు.. ఇక మిగదాతందా సేమ్ సినిమా మాదిరిగానే కదా అని తాను మిథున్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. అయినా ఇది అరంగేట్రంగా నాకు అనపించడం లేదన్నారు.
అంతేకాదు పాత్ర బాగుండి.. మంచిగా డబ్బులు ఇస్తే ఇలాంటి సిరీస్‌లు చేయడానికి తాను రెడీ అనీ మిథున్ చెప్పారు.తాను టెక్నాలజీకి దూరంగా ఉన్నా కూడా అంతపెద్ద మార్పులేవీ గమనించలేదని మిథున్ పేర్కొన్నారు.
టెక్నాలజీపరంగా మనం దూసుకెళ్తున్నాం.. ఆ విషయాన్ని కాదనలేము.. టెక్నాలజీపరంగా మనం చాలా డెవలప్ అయ్యాము.. కానీ స్టోరీలైన్ మాత్రం అలాగే ఉంది కదా అని తన అభిప్రాయాన్ని చెప్పారు. మన ఎమోషన్స్‌ను, కోపాన్ని, రొమాన్స్‌ను, రిలేషన్స్‌ను మాత్రం మార్చలేం కదా అని చెప్పుకొచ్చారు.
ఇక అలు అర్జున్ పుష్ప మూవీని ఉదహరిస్తూ.... అల్లు అర్జున్ పుష్ప మూవీ సింగిల్ స్క్రీన్ సినిమా అని అన్నారు. కానీ పుష్ప అంత పెద్ద హిట్ కావడానికి కారణం ఆ మూవీలోని కథాంశంతో జనాలకు సంబంధం ఉండడమే అని పేర్కొన్నారు.
మీరు 1980, 90లలో చేసిన సినిమాల మాదిరిగానే పుష్ప ఉందని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు మిథున్ ఇలా సమాధానం ఇచ్చారు. పుష్పలాంటి మూవీలను తాను 1990లోనే చేశానన్నారు. అప్పట్లో తాను చేసిన సినిమాలను పుష్ప పోలి ఉందన్నారు. అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను పుష్ప మూవీకి ఎంతో ఉపయోగపడింద్నారు. ఆయన నటన, టైమింగ్ ఎంతో బాగుందన్నారు. అందుకే ఈ మూవీ జనాలకు అంతలా నచ్చిందన్నారు. తనకు కూడా ప్పుష్ప మూవీ ఎంతో నచ్చిందని.. తనకు ఇష్టమైన నటుల్లో అల్లు అర్జున్ ఒకరని చెప్పుకొచ్చారు.
Also Read: DJ Tillu: విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నారా.. హీరో సిద్ధు జొన్నలగడ్డ రియాక్షన్ ఇదే.
Also Read: Sun Transits in Aquarius: కుంభ రాశిలోకి సూర్యుడి ప్రవేశం.. ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook