Viral Video: కొరియాకు పాకిన 'శ్రీవల్లి' ఫీవర్.. అల్లు అర్జున్‌ హుక్ స్టెప్‌ను అచ్చు దించేసిందిగా! చుస్తే షాకే!!

Korean Woman Srivalli hook step: ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు ఓ కొరియన్ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అల్లు అర్జున్ లాగానే దుస్తులు ధరించి హిందీ పాటకు హుక్ స్టెప్‌ వేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 08:51 PM IST
  • కొరియాకు పాకిన 'శ్రీవల్లి' ఫీవర్
  • అల్లు అర్జున్‌ హుక్ స్టెప్‌ను అచ్చు దించేసిందిగా
  • కొరియన్ వెర్షన్‌లో అల్లు అర్జున్
Viral Video: కొరియాకు పాకిన 'శ్రీవల్లి' ఫీవర్.. అల్లు అర్జున్‌ హుక్ స్టెప్‌ను అచ్చు దించేసిందిగా! చుస్తే షాకే!!

Korean Woman recreating Allu Arjun Srivalli hook step: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ భామ రష్మిక మందాన్న నటించిన 'పుష్ప: ది రైజ్‌' సినిమా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దాంతో దేశ వ్యాప్తంగా ఏడ చూసినా.. ప్రస్తుతం పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటలు పాడడం, టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 'శ్రీవల్లి' పాటలోని హుక్ స్టెప్‌కి జనాలు ఫిదా అయిపోయారు.

'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్‌ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయింది. 'శ్రీవల్లి' ఫీవర్ తాజాగా కొరియాకు కూడా పాకింది. ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న శ్రీవల్లి పాటకు ఓ కొరియన్ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అల్లు అర్జున్ లాగానే దుస్తులు ధరించి హిందీ పాటకు హుక్ స్టెప్‌ వేసింది. వెనకాల టీవీలో వీడియో సాంగ్ ప్లే అవుతుంటే.. కొరియన్ మహిళ హుక్ స్టెప్‌ను అచ్చు దింపేసింది. నిజం చెప్పాలంటే ఐకాన్ స్టార్‌కు ఏమాత్రం తీసిపోలేదు. ఎందరో రిక్రియేషన్ చేసినా.. ఇది బెస్ట్ అని చెప్పక తప్పదు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝑲𝒐𝒓𝒆𝒂𝒏 𝑮1 (@korean.g1)

కొరియన్ మహిళ డాన్స్ చేసిన వీడియోను 'కొరియన్ G1' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఈ డాన్స్ మీరు అనుకున్నదానికంటే చాలా కష్టం. కొరియన్ వెర్షన్‌లో అల్లు అర్జున్' అని క్యాప్షన్ పెట్టారు. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకి 2 లక్షలకు పైగా లైక్స్, 1.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 'హుక్ స్టెప్‌ను అల్లు అర్జున్‌ కంటే బాగా వేసిందిగా', 'అల్లు అర్జున్‌ హుక్ స్టెప్‌ను అచ్చు దించేసిందిగా', 'సూపర్ డాన్స్', 'లేడీ ఐకాన్ స్టార్' అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరో ఓ లుక్కేయండి. 

Also Read: Viral Video: సీఎం యోగి వేషధారణలో పోలింగ్‌బూత్‌కు కోహ్లీ.. సెల్పీలు దిగిన ఫాన్స్! చివరకు ట్విస్ట్!!

Also Read: Samantha Sreeshanth: సమంతతో ఆడిపాడనున్న టీమిండియా క్రికెటర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News