Allu Arvind Dance with Anupama Parameswaran: 18 పేజీస్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మూవీ యూనిట్.. తమ ఆనందాన్ని చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్ తాజాగా 18 పేజీస్ సక్సెస్ మీట్ హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌లో అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి సరదాగా స్టెప్పేశారు. అంతలోనే సుకుమార్ కూడా డ్యాన్స్ ఫ్లోర్ మీదకు రావడంతో అనుపమ పరమేశ్వరన్ సుక్కూను కూడా చేయి పట్టుకుని డాన్స్ చేసేందుకు ఇన్వైట్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటివరకు అల్లు అరవింద్‌తో కలిసి స్టెప్పేసిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత అల్లు అరవింద్, సుకుమార్‌లతో కలిసి సరదాగా డాన్స్ చేసి సక్సెస్ మీట్‌కి హాజరైన వారిని ఆకట్టుకుంది. నిఖిల్ సిద్ధార్థ కూడా వారితో కలిసి స్టెప్పేస్తూనే ఈ మొత్తం దృశ్యాన్ని తన మొబైల్లో షూట్ చేసి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అల్లు అరవింద్, అనుపమ పరమేశ్వరన్, సుకుమార్, నిఖిల్ సిద్ధార్థ అందరూ ఒక వరుస క్రమంలో రిథమిక్‌గా స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



 


కార్తికేయ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ 18 పేజీస్ మూవీతో మరో వరుస హిట్‌ని అందుకున్నాడు. సుకుమార్ స్టోరీ అందించిన ఈ సినిమాను పల్నాటి సుర్య ప్రతాప్ డైరెక్ట్ చేయగా.. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అజయ్, శత్రు, సరయు ఇతర కీలక పాత్రల్లో నటించారు.


ఇది కూడా చదవండి : Dhamaka Movie Collections: ధమాకా అనిపిస్తున్న ధమాకా మూవీ కలెక్షన్స్


ఇది కూడా చదవండి : Kalyaan Dhev Daughter : నవిష్క నా కూతురు.. ఆమె నా ప్రపంచం.. ఏడిపించేస్తోన్న కళ్యాణ్‌ దేవ్ పోస్ట్


ఇది కూడా చదవండి : Kushi Re Release Trailer : ఖుషి, ఒక్కడు రీ రిలీజ్.. ట్రైలర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఏది బెటర్ అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook