AlluArjun's Pushpa Movie Eyy Bidda Idhi Naa Adda full video song out : పుష్ప మూవీ నుంచి ఇప్పటికే పలు పాటల ఫుల్‌ వీడియోలు రిలీజై యూట్యూబ్‌లో మోత మోగిస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీలోని మరో మాస్ సాంగ్ (Mass Song) ఫుల్‌ వీడియో (Full video) యూట్యూబ్‌లోకి వచ్చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా అనే సాంగ్‌ (Eyy Bidda Idhi Naa Adda full video song) పుష్ప మూవీలో హైలైట్. ఆ సాంగ్ ఫుల్‌ వీడియోను మూవీ మేకర్స్‌ (Movie Makers‌) సోషల్ మీడియా (Social media) వేదికగా తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్‌ (Allu Arjun‌) స్పెషల్ మ్యానరిజం సూపర్బ్‌గా ఉంటుంది. 


చంద్రబోస్‌ రాసిన ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా (Eyy Bidda Idhi Naa Adda full video song) పాటను నకాష్‌ అజిజ్‌ పాడారు. దేవిశ్రీ ప్రసాద్‌ దుమ్ములేపే మ్యూజిక్ (Music) ఇచ్చారు. ఇక ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్‌లో కేవలం ఒక్క షాట్‌ కోసమే బన్నీ (Bunny) పన్నెండు గంటలకు పైగా కష్టపడ్డారు. మధ్యాహ్నం రెండింటికి షూటింగ్ ప్రారంభిస్తే.. తెల్లవారుజామున రెండు వరకు ఆ ఒక్క షాట్‌ కోసమే బన్నీ కష్టపడ్డారట. 




 


Also Read : Keerthy Suresh Corona: హీరోయిన్ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్


ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ (Allu Arjun).. పుష్పరాజ్‌గా జీవించేశాడు. శ్రీవల్లిగా రష్మిక చింపేసింది. ఇక సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌, అజయ్‌, అజయ్‌ ఘోష్‌ల పాత్రలు సినిమాకే హైలైట్. ప్రస్తుతం పుష్ప మూవీ అమెజాన్‌ (Amazon‌) ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు పుష్ప (Pushpa) మూవీని సంయుక్తంగా నిర్మించాయి. 


Also Read : Rashi Khanna Photos: వైట్ శారీలో అందాలతో ఊరిస్తున్న బెల్లం శ్రీదేవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook