Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్‌డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
Prabhas nag ashwin film update: బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్‌డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'రాధే శ్యామ్' షూటింగ్ జరుగుతుండగా.. రెండో సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మూడో సినిమా ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రాల్లో నటించనున్నాడు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ తరువాత.. నాగ్ అశ్విన్ ( Nag Ashwin) చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా... బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే (deepika padukone) ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. Also read: Prabhas: మీ ప్రేమకు.. థ్యాంకూ డార్లింగ్స్
ప్రభాస్ హీరోగా.. దాదాపు 500కోట్ల బడ్జెట్‌తో వస్తున్న నాగ్ అశ్విన్ చిత్రం అప్‌డేట్ గురించి నిన్న చెప్పినట్టుగానే.. కొద్ది సేపటి క్రితమే మూవీ మేకర్స్ అదిరిపోయే శుభవార్తను వెల్లడించారు. నాగ్ అశ్విన్- ప్రభాస్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా కీలక పాత్ర పోషించనున్నట్టు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది వైజయంతీ మూవీస్. ప్రముఖ లెజండరీ నటుడు లేకుండా.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎలా చేస్తాం అంటూ.. పది సెకన్ల వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా అమితాబ్ బచ్చన్ మూవీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మొత్తం పాన్ ఇండియా స్టార్లు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే నటిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా ఖరారు కావాల్సి ఉంది. అదికూడా అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు నాడు ప్రకటిస్తారని తెలుస్తోంది. Also read: NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు
Also read: Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe