Anchor Anasuya: మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ
Anchor Anasuya as Devadasi in Rangamartanda: బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే వెండితెరపై అడపాదడపా ఆకట్టుకునే పాత్రల్లో పలు చిత్రాలు చేస్తోన్న యాంకర్ అనసూయకు తాజాగా మరో మంచి సినిమా ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. అనసూయకు సిల్వర్ స్క్రీన్ పైనా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ సినిమాలో యాంకర్ అనసూయ దేవదాసి పాత్రలో ( Anasuya in Devadasi role ) కనిపించనుందని సమాచారం.
Anchor Anasuya as Devadasi in Rangamartanda: బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే వెండితెరపై అడపాదడపా ఆకట్టుకునే పాత్రల్లో పలు చిత్రాలు చేస్తోన్న యాంకర్ అనసూయకు తాజాగా మరో మంచి సినిమా ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన నుంచి మొదలుకుని రంగస్థలంలో రంగమ్మత్త ( Rangammatha ) వరకు అనేక పాత్రలు పోషించిన అనసూయకు సిల్వర్ స్క్రీన్ పైనా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ అనసూయ పాపులారిటీకి తగినట్టుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న రంగమార్తండ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం లభించినట్టు సమాచారం. మరాఠీ చిత్రం నటసామ్రాట్ ఆధారంగా కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. Also read : Bigg Boss 4 Telugu: బెడ్ రూమ్‌లో ఏమన్నావ్.. మోనల్‌పై అభిజీత్ ఫైర్
రంగమార్తండ మూవీలో యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) చేసే పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా అంటే అందులోని పాత్రలు ఎంత సహజంగా ప్రాణం పోసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే రంగమార్తండలో అనసూయ చేయబోయే పాత్ర కూడా అద్భుతంగా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ సినిమాలో యాంకర్ అనసూయ దేవదాసి పాత్రలో ( Anasuya in Devadasi role ) కనిపించనుందని సమాచారం. Also read : Gangavva to leaves Big Boss 4 Telugu: బిగ్ బాస్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ.. గంగవ్వకు వెళ్లాలని లేకున్నా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe