Bigg Boss 4 Telugu: బెడ్ రూమ్‌లో ఏమన్నావ్.. మోనల్‌పై అభిజీత్ ఫైర్

బిగ్ బాస్ 4లో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఆరోగ్యం బాగలేని కారణంగా గంగవ్వ ( Gangavvva ) తనకు తానే వెళ్లిపోగా.. ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో మరో కంటెస్టంట్ జోర్దార్ సుజాత ( Bigg boss contestant Jordar Sujatha eliminated) హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. 

Last Updated : Oct 12, 2020, 07:45 PM IST
Bigg Boss 4 Telugu: బెడ్ రూమ్‌లో ఏమన్నావ్.. మోనల్‌పై అభిజీత్ ఫైర్

బిగ్ బాస్ 4లో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఆరోగ్యం బాగలేని కారణంగా గంగవ్వ ( Gangavvva ) తనకు తానే వెళ్లిపోగా.. ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో మరో కంటెస్టంట్ జోర్దార్ సుజాత ( Bigg boss contestant Jordar Sujatha eliminated) హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇదిలావుంటే, శనివారం రోజు జరిగిన ఎపిసోడ్‌లో అంతకుముందు జరిగిన నామినేషన్ ప్రక్రియలో మోనల్ గజ్జర్ ( Monal Gajjar ) విషయాన్ని ప్రస్తావించినందుకు అఖిల్, అభిజీత్‌లకు నాగార్జున ( BB4 host Nagarjuna ) వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విషయంపై నాగార్జున మాట్లాడుతూ.. అఖిల్, అభిజిత్‌లలో ఎవరిది తప్పు అని మోనల్‌ని అడగగా 'ఇద్దరి తప్పు ఉంది' అని సమాదానం ఇచ్చింది. Also read : Bigg boss 4 Telugu contestant : కంటెస్టంట్స్‌కి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇదే విషయంపై ఆ తర్వాత అభిజీత్ వెళ్లి మోనల్ గజ్జర్‌‌తో మాట్లాడుతూ ఆమెపై పైర్ అయ్యాడు. ఈ రోజు విడుదలైన ప్రొమోలో ఈ దృశ్యాన్ని విడుదల చేశారు. ' నీ బెడ్ రూమ్‌లో కూర్చుని మాట్లాడేటప్పుడు అఖిల్ ( Akhil ) మొదట నా పేరు ప్రస్తావించాడు కాబట్టి అతడిదే తప్పు అని చెప్పావు కదా... మరి నాగార్జున సార్ అడిగినప్పుడు ఇద్దరిదీ తప్పు అని ఎందుకు చెప్పావు అంటూ అభిజీత్ ( BB4 contestant Abhijeet ) మోనల్‌ని నిలదీశాడు. నీకు నచ్చినపుడు ఒకలా ఉంటావు, ఇష్టం లేనప్పుడు మరోలా ఉంటావు. నీపై అఖిల్‌కి ప్రేమే ఉంటే నీ పేరు ఎందుకు వాడుకుంటాడు' అని అభిజీత్ మోనల్‌పై విరుచుకుపడ్డాడు. దీనికి మోనల్ కన్నీరు పెట్టుకుంది. Also read : Gangavva to leaves Big Boss 4 Telugu: బిగ్ బాస్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ.. గంగవ్వకు వెళ్లాలని లేకున్నా..

 

Trending News