Anicka Vikramman: నటిని చచ్చేలా కొట్టిన ప్రియుడు.. కలకలం రేపుతున్న ఫొటోలు!
Anicka Vijayi Vikramman Attacked: తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన మీద దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన నటి అనికా విక్రమన్ అందుకు సంబందించిన ఫోటోలు సైతం షేర్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు
Anicka Vijayi Vikramman Attacked by Ex Boy Friend: తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన మీద దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది బెంగళూరుకు చెందిన నటి. నటి అనికా విక్రమన్ కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసించేది. తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో భాగమైన ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తర్వాత ఐకేకే విశ్వకర్మ అనే సినిమాల ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా గాయాలపాలైన కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఆమె ఒక సుదీర్ఘమైన లెటర్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
తాను అనూప్ పిళ్ళై అనే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నానని అతను తనను మానసికంగా చివరికి శారీరికంగా కూడా వేధించాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఇంత ఇన్సైక్యూర్ గా మానిప్యులేట్ చేస్తూ ఇంత జరిగినా కూడా నన్ను భయపెడుతున్నాడని అన్నారు. నేను ఇలా జరుగుతుందని ఇప్పుడు కలలో కూడా ఊహించలేదు. అతను నన్ను రెండో సారి కొట్టినప్పుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాను మొదటిసారి అతను నన్ను చెన్నైలో దాడి చేశాడు. తర్వాత నా కాళ్ళ మీద పడి పొరపాటు జరిగి పోయింది. ఈ ఒక్కసారికి క్షమించమని వేడుకున్నాడు. రెండో సారి నేను ఫిర్యాదు చేస్తే అతను పోలీసులకు లంచం ఇచ్చి ఈ విషయాన్ని మీరు మీరే తెలుసుకోమని చెప్పించేలా చేశాడు.
అలా చేయడమే అతనికి మళ్ళీ మళ్ళీ దాడి చేసేలా ప్రోద్బలం ఇచ్చింది. అతనితో రిలేషన్ లో ఉన్నన్నాళ్ళు ఎన్నో సార్లు మోసపోతూ వచ్చాను. నన్ను ఎన్నోసార్లు మానిప్యులేట్ చేస్తూ వచ్చాడు. చివరికి నేను అతన్ని వదిలేయాలనుకుంటే కూడా అతను వదల్లేదు, మేము చాలా కాలం స్నేహితులుగా ఉండటంతో అతని మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది, నేను సినిమా షూటింగ్ కి వెళ్ళకూడదని నా ఫోన్ కూడా పగలగొట్టాడని అన్నారు. మేమిద్దరం రిలేషన్ లో లేకపోయినా నా వాట్సాప్ అంతా అతను చెక్ చేస్తూ ఉండేవాడు. అతని లాప్టాప్ లో నా వాట్సాప్ లాగిన్ అయి ఉంది. అలా ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలని అనుకున్న సమయంలో అతను నా ఫోన్ లాక్ చేసి నా ఫోన్ అతనికి ఇచ్చే వరకు వదలలేదు.
నాకంటే నాలుగింతలు బరువు ఉండే అతను నా మీద కూర్చుని ఫోన్ ఇచ్చేవరకు వదలలేదు, నా నోటిని బలంగా మూసేయడంతో నేను గొంతు పెగిల్చి అరవ లేకపోయాను. నా స్పృహ అప్పుడు కోల్పోయింది, అలా స్పృహ కోల్పోతున్న సమయంలో ఇదే నా చివరి రోజు అనుకున్నాను. నేను వేరే గదిలోకి వెళ్తే ఆ గది కూడా ఓపెన్ చేస్తాడని భావించి బయటకు పరిగెత్తు వెళ్ళిపోయానని పేర్కొంది. బయట సెక్యూరిటీ వాళ్లకు చెబితే వాళ్ళు ఏం చేయలేమన్నారు, కాబట్టి ఉదయం వరకు వాష్ రూమ్ లోనే ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. నా ముఖం మీద తీవ్రంగా దాడి చేసిన తర్వాత ఈ ముఖం పెట్టుకుని ఎలా నటిస్తావో చూస్తా అనే అతను అన్న మాటలు నా చెవిలో ఇంకా మోగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. తర్వాత నేను అద్దం దగ్గరికి వెళ్లి చూస్తే మా ముఖం మీద ఉన్న గాయాలు చూసి బిగ్గరగా ఏడుస్తుంటే ఇంకా చాలు నీ డ్రామా బాగుంది అన్నాడు.
నన్ను కొట్టిన తర్వాత వెళ్లి వాళ్ళ స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు, ఒకవేళ కృరత్వానికి గనక ముఖమే ఉంటే అది అతని లాగానే ఉంటుందేమో. ఇంత చేసిన తర్వాత నాకున్న బాధ గురించి పట్టించుకోకుండా నేను నా కుటుంబ సభ్యులకు, పోలీసులకి చెప్పానేమో అని టెన్షన్ పడ్డాడు. నా కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నా స్నేహితుడు కూడా నన్ను డబ్బు కోసం మోసం చేశారు. ఇప్పుడు భగవంతుడు దయ వల్ల నేను పూర్తిగా కోలుకున్నాను.
ఇలా పూర్తిగా కోలుకోవడానికి నాకు నెల పట్టింది. అతన్ని కూడా క్షమించేసి నేను నా పనిలో పడ్డాను, ఈ విషయం మీద నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను, ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడు. న్యూయార్క్ లో ఉన్నాడు. మళ్లీ అతని నుంచి వస్తున్న బెదిరింపులు కారణంగానే నేను దీన్ని పోస్ట్ చేశాను. నేను ఇప్పుడే మళ్ళీ కోలుకొని సినిమా షూటింగ్స్ కి వెళ్తున్నాను. నాకు అందరూ ధైర్యం చెప్పండి ఇంకా చేస్తే ఇప్పటికీ తనను ఇబ్బంది పెడుతూ కాల్స్ మెసేజెస్ వస్తున్నాయని ఆ పేర్కొన్నారు.
Also Read: Ibomma 2023 Fake Alert: ఐబొమ్మ వాడుతున్నారా? అయితే రిస్క్ లో పడ్డట్టే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి