Fake Ibomma Alert: ఓటీటీలో వచ్చే సినిమాలను వెబ్ సిరీస్ లను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఐ బొమ్మ అనే వెబ్సైట్ని నిర్వహిస్తున్నారు కొంతమంది ఔత్సాహికులు. ఈ ఐ బొమ్మ వెబ్సైట్ ఎవరు నిర్వహిస్తున్నారు? అనే విషయం క్లారిటీ లేదు. కానీ గతంలో కొన్ని రోజుల ముందు ఈ ఐ బొమ్మ వెబ్సైట్ని నిర్వహించలేక పోతున్నామని నిలిపివేస్తున్నాము అంటూ ఒకసారి ప్రకటన చేశారు. ఆ తర్వాత ఐ బొమ్మ ఫాలోవర్స్ అందరూ అలా చేయవద్దని కోరడంతో దాన్ని కొనసాగించారు.
తర్వాత మరోసారి తమ మీద ఆరోపణలు వస్తున్నాయని తామేదో డేటా దొంగిలిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటూ మరోసారి ఇదే విధంగా ఐ బొమ్మ వెబ్సైట్ నిలిపివేస్తున్నామని ప్రకటించారు. నిజంగానే నిలిపిస్తున్నారేమోనని మరోసారి ఆ ఐ బొమ్మ వెబ్సైట్ వాడే వారంతా వెబ్సైట్ నిర్వాహకులకు రిక్వెస్ట్ చేయడంతో మరోసారి అలాంటిదేమీ లేదని ఖచ్చితంగా సైట్ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇండియా వరకు ఈ సేవలు వేస్తున్నామని ప్రకటించి కలకలం రేపారు. తర్వాత కూడా మళ్లీ సైట్ కొనసాగింది. ఈ మధ్యకాలంలో ఐ బొమ్మ సైట్ నిలిచిపోవడంతో ఇక పూర్తిగా సేవలు నిలిపివేశారు అనుకున్నారు.
కానీ అదేమీ కాదని కొన్ని సాంకేతిక కారణాల వల్ల సైట్ నిలిచిపోయిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐ బొమ్మను పోలిన మరో కొన్ని కొత్త వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. అవి స్పామ్ వేర్ ను స్ప్రెడ్ చేస్తున్నాయి అని తెలుస్తోంది. ఆయా వెబ్సైట్స్ లోకి వెళ్లి ఏదైనా సినిమా మీద క్లిక్ చేస్తే వెంటనే వేరే వేరే లింకులు ఓపెన్ అవుతున్నాయని, అలా కావడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
నిజానికి ఐ బొమ్మ నిర్వాహకులు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే తమ ఐ బొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చిన సైట్స్ లో ఈ మధ్య రిలీజ్ అయిన థియేటర్ సినిమాలను కూడా పెడుతున్నారు. వాటి మీద క్లిక్ చేస్తే అవి ఎక్కడికో వేరే లింకులు ఓపెన్ అవుతున్నాయి. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని కోరుతున్నారు నిపుణులు.
Also Read: Amitabh Bachchan Injured: అమితాబ్ గాయాలు నిజం కాదా.. అశ్వినిదత్ ఇలా అంటున్నారేంటి?
Also Read: Nandini Reddy Says Sorry: కేజీఎఫ్ హీరోపై నీచ్ కమీన్ కుత్తే కామెంట్స్.. నందినీ రెడ్డి క్షమాపణలు!