Ante Sundaraniki Twitter Review: టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'అంటే సుంద‌రానికి'. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. నేడు (జూన్‌ 10న) తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అంటే సుంద‌రానికి' సినిమా ఒకరోజు ముందే అమెరికాలో విడుదల కాగా.. నేడు ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సామజిక మాధ్యమాల ద్వారా తమతమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 'రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'సినిమా చివరి వరకు నవ్వుతూనే ఉన్నా. నాని నటన, వివేక్ ఆత్రేయ రచన బాగుంది' అని  ఇంకో అభిమాని ట్వీట్ చేశాడు. 'డీసెంట్ ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ బాగుంది', 'హిట్ టాక్ తెచ్చుకుంది.. ఎంత కలెక్ట్ చేస్తుందో', 'క్లాసిక్  రొమాంటిక్ కామెడీ సినిమా.. వినోదాత్మకంగా మరియు భావోద్వేగంగా ఉంది'అని కామెంట్స్ చేస్తున్నారు. 



అంటే సుందరానికీ సెకండ్ హాఫ్ బాగుందని చాలా మంది ఫాన్స్ అంటున్నారు. సుదీర్ఘ నిడివి కలిగిన కథను బోర్ కొట్టకుండా చెప్పడంలో వివేక్ ఆత్రేయ సక్సెస్ అయ్యాడట.  ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడట. నాని-నజ్రియాల యాక్టింగ్, వివేక్ ఆత్రేయ రాసుకున్న కామెడీ-సన్నివేశాలు అలరిస్తాయని ప్రేక్షకులు అంటున్నారు. చివరగా అంటే సుందరానికీ సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెపుతున్నారు. 






Also Read: Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్ల వివరాలు ఇవే!


Also Read: Horoscope Today June 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనలాభం!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook