HBD Anushka Shetty : అనుష్క శెట్టి తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుంచి తన ఫ్యాన్స్‌కు, తనకు విషెస్ చెప్పిన సెలెబ్రిటీలకు రిప్లైలు ఇస్తూ వచ్చింది. ఇందులో కొందరికి హగ్గుల ఎమోజీలు షేర్ చేసింది. తన బొమ్మను పెయింట్ చేసిన అభిమానికి రిప్లై ఇచ్చింది. కాజల్ అగర్వాల్, మంచు లక్ష్మీ, నీలిమ గుణ వంటి వారి విషెస్‌లకు స్పందిస్తూ.. హగ్గులు ఇస్తున్న ఎమోజీలను షేర్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కోన వెంకట్, డైరెక్టర్ హేమంత్, హీరో నవీన్ పొలిశెట్టి, యూవీ క్రియేషన్స్ వంటి వారు వేసిన ట్వీట్లకు రిప్లై ఇచ్చింది. అందరికీ థాంక్స్ అని తెలిపింది. ఇలా తనకు విషెస్ చెప్పిన ప్రముఖలకు పేరు పేరునా స్పందించింది. రిప్లైలు ఇచ్చింది. మీరు కురిపించిన అనంతమైన ప్రేమకు థాంక్స్.. మీ ప్రేమ, మీ విషెస్ నా వరకు చేరుకున్నాయి.. నా కోసం సమయం కేటాయించిన ప్రతీ ఒక్కరికీ విషెస్ చెప్పిన అందరికీ పెద్ద హగ్.. ఎల్లప్పుడూ మీ అందరికీ థాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను అని అనుష్క శెట్టి ట్వీట్ వేసింది.


అనుష్కకు బాహుబలి తరువాత వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే. కానీ అనుష్క మాత్రం ఆ క్రేజ్‌ను వాడుకోవడంలో విఫలమైంది. భాగమతి పర్వాలేదనిపించింది. నిశ్శబ్దం సినిమాతో సంచలనం క్రియేట్ చేద్దామని అనుకుంది. కానీ ఆ సినిమా దారుణంగా బోల్తా పడింది. ఆ తరువాత ఇంత వరకు మళ్లీ ఇంకో సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు. ఇప్పుడు కుర్ర హీరో నవీన్ పొలిశెట్టి సినిమాతో అనుష్క త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ నుంచి అనుష్క ఫస్ట్ లుక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆమె మాస్టర్ షెఫ్‌గా నటించనున్నట్టుగా కనిపిస్తోంది.
 


Also Read : Renu Desai : సమంత ఫ్రెండ్‌కు రేణూ దేశాయ్ విషెస్.. డాక్టర్‌పై పోస్ట్ వైరల్


Also Read : Niharika - Brahmanandam : నాకు కొత్త ఫ్రెండ్ దొరికినట్టేనా?.. బ్రహ్మానందంపై మెగా డాటర్ ఫన్నీ కామెంట్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook