AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తల్లి కన్నుమూత
AR Rahmans Mother Death News: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తల్లి కరీమా బేగం కన్నుమూశారు.
AR Rahmans Mother Death News: ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తల్లి కరీమా బేగం సోమవారం (డిసెంబర్ 28న) కన్నుమూశారు. వయసురీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న కరీమా బేగం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. నేటి సాయంత్రం కరీనా బేగం అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.
కాగా, కరీమా బేగం వివాహం సంగీత దర్శకుడు రాజగోపాల కులశేఖరన్‌తో జరిగింది. వీరి నలుగురు సంతానంలో ఏఆర్ రెహమాన్(AR Rahman) చిన్నవాడు. కరీమా బేగం భర్త ఆర్‌కే శేఖర్ రెహమాన్ 52 సినిమాలకు సంగీత దర్శకుడిగా సేవలు అందించారు. వంద సినిమాలకు మ్యూజిక్ పనుల పర్యవేక్షణ చేశారు.
Also Read: Rajinikanth: ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
ఏఆర్ రెహమాన్ తొమ్మిదో ఏట తండ్రి రాజగోపాల కులశేఖరన్ కన్నుమూశారు. ఆపై స్వశక్తితో రెహమాన్ ఎదిగారు. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ (Bollywood) సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసి, ఆస్కార్ అవార్డును సైతం సాధించారు. తల్లిని, కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వయసురీత్యా సమస్యలతో నేడు ఆయన తల్లి కరీమా బేగం తుదిశ్వాస విడిచారు. ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. రెహమాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
Also Read: Chiranjeevi ఆచార్య సెట్‌లో రామ్ చరణ్ సందడి.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook