Chiranjeevi ఆచార్య సెట్‌లో రామ్ చరణ్ సందడి.. ఎందుకో తెలుసా?

  • Dec 27, 2020, 12:59 PM IST

Ram Charan in Chiranjeevi's Acharya Set - In Pics | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న తెలిసిందే. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

1 /4

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎండాకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.  

2 /4

ఈ క్రమంలో నిర్మాత రామ్ చరణ్ ఆచార్య సెట్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. దర్శకుడు కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్‌ సెల్వరాజన్‌తో ఆదివారం సరదాగా సంభాషించారు. అయితే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్లు గత కొన్నిరోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. 

3 /4

సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా.. అక్కడికి వెళ్లారా లేక ఆయన పాత్ర షూటింగ్‌కు వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది.

4 /4

ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ సురేష్‌ సెల్వరాజన్‌ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.