Aryan Rajesh as Villian: టాలీవుడ్ కి కొత్త విలన్.. రంగం సిద్దం చేసిన టాప్ డైరెక్టర్!
Aryan Rajesh to start second innings as Villian: ఆర్యన్ రాజేష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక బడా డైరెక్టర్ ఆర్యన్ రాజేష్ ను విలన్ గా పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Aryan Rajesh to start second innings as Villian: తెలుగు సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నట వారసులుగా ఇద్దరు కుమారులు హీరోలుగా రంగ ప్రవేశం చేశారు. పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా నిలదొక్కు కోవడానికి అనేక ఇబ్బందులు పడినా చిన్న కుమారుడు అల్లరి నరేష్ మాత్రం ఒకరకంగా హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆర్యన్ రాజేష్ కు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు.
అందుకే ఆయన తెలుగు సినీ పరిశ్రమకు కాస్త దూరమయ్యాడు. దూరమయ్యాడు అనడం కంటే చాలా గాప్ ఇచ్చాడనే చెప్పాలి. 2012వ సంవత్సరంలో బాలరాజు ఆడి బామ్మర్ది అనే తెలుగు సినిమా చేసిన ఆయన ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని తమిళంలో ఒక సినిమా చేశారు. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమాలో రామ్ చరణ్ సోదరుడిగా నటించారు. ఈ సినిమాలో ఆయన విలన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కానీ అది అయితే నిజం కాలేదు, ఆ సినిమాలో రామ్ చరణ్ సోదరుడి పాత్రలో ఆర్యన్ రాజేష్ నటించారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్యన్ రాజేష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక బడా డైరెక్టర్ ఆర్యన్ రాజేష్ ను విలన్ గా పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్యన్ రాజేష్ ఈ మధ్యనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందిన హలో వరల్డ్ అనే ఒక వెబ్ సిరీస్ లో ఒక ఐటీ ఉద్యోగి పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించారు.
ఇప్పుడు ఒక బడా డైరెక్టర్ పుణ్యమా అని ఆయన మరోసారి పూర్తిస్థాయిగా సినిమాల మీద దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయనను విలన్ గా పరిచయం చేసేందుకు సదరు డైరెక్టర్ ఇప్పటికే అంతా సిద్ధం చేశారని ఆర్యన్ రాజేష్ కు కథ కూడా చెప్పారని ఆ కథ కూడా ఆర్యన్ రాజేష్ కు బాగా నచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ఆర్యన్ రాజేష్ ప్రకటిస్తే గాని ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి చూడాలి ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు ఈ విషయాలు తీసుకు వస్తున్నారనేది.
Also Read: Prabhas Professional Ethics: తీవ్ర విషాదంలోనూ ప్రభాస్ వృత్తి ధర్మం.. నిర్మాతలకు అభయమిస్తూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.