Chandra Hass Getting Trolled: కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ ఒక్క ప్రెస్ మీట్ తోనే సంపాదించిన బుల్లితెర మెగాస్టార్ కొడుకు!

ETV Prabhakar’s Son Chandra Hass Getting Trolled Hugely : ఈ టీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. చంద్రహాసన్ ను తెలుగు మీడియాకి పరిచయం చేసేందుకు ప్రభాకర్ కుటుంబం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 22, 2022, 11:00 AM IST
Chandra Hass Getting Trolled: కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ ఒక్క ప్రెస్ మీట్ తోనే సంపాదించిన బుల్లితెర మెగాస్టార్ కొడుకు!

ETV Prabhakar’s Son Chandra Hass Getting Trolled Hugely : ఈ టీవీ ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై సీరియల్స్ చూసే వారికి చూడని వారికి సైతం ప్రభాకర్ సుపరిచితమే. కేవలం సీరియల్స్ లోనే కాదు కొన్ని సినిమాలలో కూడా అడపాదడపా ప్రభాకర్ కనిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు చంద్రహాస్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఇటీవల కొద్ది రోజుల క్రితం చంద్రహాసన్ ను తెలుగు మీడియాకి పరిచయం చేసేందుకు ప్రభాకర్ కుటుంబం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చంద్రహాసన్ ను  మీడియాకు పరిచయం చేస్తున్న సమయంలో చంద్రహాసన్ నడుచుకున్న తీరు, ఆయన వ్యక్తం చేసిన హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  తల్లిదండ్రులు అతనిని పరిచయం చేస్తుంటే కుదురుగా ఉండి మీడియా ముందు పద్ధతిగా నడుచుకోవాల్సింది పోయి ఇంకా పిల్లవాడి లాగా పైకి చూస్తూ గాల్లోకి చూస్తూ కాళ్ళు చేతులు ఊపుతూ నిలబడడంతో సోషల్ మీడియాలో చంద్రహాసన్ నుట్రోలర్లు ఒక్కసారిగా టార్గెట్ చేశారు.

ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఒక స్టార్ లాగా ఫీల్ అయిపోతూ, గంతులు వేస్తున్నాడని, గాల్లోకి చూస్తున్నాడని ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తూ అతనిని టార్గెట్ చేస్తున్నారు ట్రోలర్లు. అయితే తన కుమారుడిని ఇలా చేయడం ఏమీ బాలేదని ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేసినట్లు కూడా యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. కానీ అది కేవలం ఒక థంబ్ నైల్ అని తెలుస్తోంది. ఒక రకంగా ఇలా ట్రోల్ చేయించుకునేందుకే కొంతమంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియా పేజీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. 

అలాంటిది రూపాయి ఖర్చు పెట్టకుండా చంద్రహాస్ బీభత్సంగా ట్రోల్ అయ్యాడని అది నెగిటివా, పాజిటివా అనేది పక్కన పెడితే సినీ పరిశ్రమలో ఏం పబ్లిసిటీ అయినా ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక పెద్ద అవకాశం అనే చెప్పాలి. ఇప్పుడు చంద్రహాస్ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. పబ్లిసిటీకి పెద్దగా ఖర్చు పెట్టకుండానే చంద్రహాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. సాధారణంగా హీరో హీరోయిన్ల పిల్లలు ఇలా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో కూడా చాలా పుషప్ ఇస్తూ ఉంటారు, కానీ చంద్రహాస్ విషయంలో సోషల్ మీడియానే ఆ బాధ్యత తీసుకొని ఆయన ముందుకు పుష్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఫ్యూచర్లో ఆయన సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడు అని.
Also Read: Chennakesava Reddy Re Release: రికార్డుల బద్దలు దిశగా చెన్నకేశవ రెడ్డి రీ రిలీజ్!

Also Read: Prabhas Professional Ethics: తీవ్ర విషాదంలోనూ ప్రభాస్ వృత్తి ధర్మం.. నిర్మాతలకు అభయమిస్తూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News