Bandla Ganesh : ఆ వెబ్ సైట్ మీద బండ్లన్న ఫైర్.. అంతు చూస్తానంటూ ట్వీట్ల వర్షం
Bandla Ganesh Satires On Media బండ్ల గణేష్ తాజాగా వరుసగా ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు. బండ్ల గణేష్ ఓ మీడియా, వెబ్ సైట్ మీద మండి పడ్డాడు. బ్యాన్ చేయండి.. ఇంటర్వ్యూలు ఇవ్వకండి.. అంతు చూస్తానంటూ ఇలా దుమ్ముదులిపేశాడు బండ్ల గణేష్.
Bandla Ganesh ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం కంటే ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తూ వివాదాస్పదంగా మారుతున్న బండ్ల గణేష్ తాజాగా వరుస ట్వీట్లతో ఒక వెబ్సైట్ను, ఆ వెబ్సైట్ నిర్వాహకుడిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. సదరు వెబ్సైట్ కథనాన్ని షేర్ చేసిన బండ్ల గణేష్ అరే వెంకట్ రెడ్డి ఓ పెద్ద బ్రోకర్ మీ మూర్తి చిన్న బ్రోకర్ నీలి వార్తలు రాసుకుని నీలి బతుకులు బతుకుతూ దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫూట్ అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. మేము ప్రేమిస్తాం ప్రాణం ఇస్తాం పూజిస్తాం కోపం వస్తే అడుగుతాం ప్రేమించినప్పుడు పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫూట్ అంటూ కామెంట్లు చేశారు.
బండ్ల గణేష్ సినిమా వాళ్ళ వార్తలు వాళ్ళ ఇంటర్వ్యూ లేకపోతే నీకు పబ్బం గడవదు రా వెంకీగా నువ్వు మనిషివైతే నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు తినేది అన్నం అయితే నాకు ఒకసారి ప్రత్యక్షంగా కనపడు. నీలి వార్తలు రాసుకొని నీ బతుకు నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి నువ్వు చూసుకో రా బఫూన్ నా కొడకా. నిజాయితీగల వాడితో దూరంగా ఉండడానికి ప్రయత్నించు నీతిగా బతికేవాడు జోలికి రాకుమాడి మసైపోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ తర్వాత కూడా ఆయన అక్కడితో ఆగకుండా వరుస ట్వీట్లు చేస్తూ సినీ పరిశ్రమంలో ఉన్న ఇతరులకు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు బండ్ల గణేష్.
ఈ వెంకీ గాడికి వాడికి సంబంధించిన దానికి దయచేసి ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు, సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు మన తెలివితో మన కష్టంతో మన రక్తాన్ని చమటగా మార్చి పని చేసుకుని కళామ తల్లి సేవలో ఉన్న మనందరం దాన్ని బహిష్కరిద్దాం. వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు, మన రివ్యూలు రాస్తే మన మీద తప్పుగా రాస్తే మన గురించి చౌకగా చీపుగా రాస్తే వాడి అంతు నేను చూస్తా, వాడు రాజకీయాల్లో ఎన్ని అయినా చేసుకోమను మనకు సంబంధం లేదు సినిమా పరిశ్రమపై, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలపై, సినిమాని నమ్ముకుని బతుకుతున్న వాళ్లపై ఏమాత్రం రాసినా సహించేది లేదు. దయచేసి ఆ వెబ్ సైట్ ను బహిష్కరించండి.
ఈ పచ్చని మల్లె తోటలో ఈ గంజాయి మొక్కను పీకేద్దాం, కళామతల్లిని సంరించుకుందాం. కళామతల్లి నీడలో బ్రతుకుతూ, సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన న్యూస్ ని గ్రేట్ ఆంధ్రకిస్తే మన తల్లిదండ్రులను, ఆత్మను మోసం చేసుకున్నట్టు. ఇలాంటి దాన్ని మనం బహిష్కరించకపోతే మనకు మనం మోసం చేసుకున్నట్టే. నువ్వు రాజకీయంలో ఎవరినైనా తిట్టుకో.. ఎవరినైనా కొట్టుకొ మాకు సంబంధం లేదు. కానీ సినిమా వాళ్ళ జోలికి వచ్చావా? వెంకీ నీ పెంకి పగులుద్ది అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి మోసాన్ని బహిష్కరించకపోతే మన భావితరాలకు చాలా పెను ప్రమాదం, మనం వాళ్ళకి భయపడుతూ, సినిమా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!
మన తెలివి, మన కష్టంతో, మన శ్రమ, మన సినిమా, మన విజయం, మన భవిష్యత్తు, అని పేర్కొన్న ఆయన గ్రేట్ ఆంధ్ర జర్నలిస్టును మన ఇంటర్వ్యూకు పిలువొద్దు, వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు గ్రేట్ ఆంధ్ర హటావో.. కళామతల్లికి బచావో అనే నినాదంతో ముందుకు పోదాం అంటూ ఆయన పేర్కొన్నారు. రేయ్ వెంకట్ మా సినిమా వాళ్ళకు కులాలు లేవురా.. మా గోత్రం పేరు కష్టం.. మా కులం పేరు తెలివి.. కష్టం.. తెలివి కలిస్తేనే సినిమా కులం.
మాకు కులాలు మతాలు లెవురా లఫుట్. సినీమా తల్లీ కులం, మా సినిమా కళమ్మ తల్లి. ఎక్కడో అమెరికాలో ఉండి వ్యాపారం చేయడం కాదురా వెంకట్.. నీకు దమ్ముంటే రా మన గడ్డ మీద ఉండి పోరాడుదాం.. దా..! ప్లేస్ నువ్ చెప్పు మేము వస్తాం. అమెరికాలో దొంగచాటుగా బ్రతుకుతూ, దొంగ రాతలు రాసుకొనే దొంగనా కొ...! అంటూ బండ్ల గణేష్ ముగించాడు.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK