Bangarraju Movie: కరోనా మహమ్మారి కారణంగా సంక్రాంతి బరిలోంచి పెద్ద సినిమాలు ఒక్కొక్కటికా తప్పుకున్నాయి. పండుగ బరిలో సింగిల్‌గా వచ్చి..కలెక్షన్ల వర్షం సాధిస్తున్న సినిమాగా బంగార్రాజు సునామీ సృష్టిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాల విషయంలో నాగార్జున క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి. అదే జరిగింది. పండుగకు తప్పకుండా వస్తుందని..టికెట్ రేట్లు, కరోనా మహమ్మారి తన సినిమాపై ప్రభావం చూపించదని ముందు నుంచీ చెబుతున్న నాగార్జున నమ్మకమే నిజమైంది. పండుగ వేళ..కరోనా మహమ్మారి కారణంతో బరిలోంచి పెద్ద సినిమాలన్నీ తప్పుకున్నాయి. పండుగ లాంటి సినిమా..పండుగకు మాత్రమే వచ్చే సినిమా అంటూ వచ్చేసిన బంగార్రాజు దూసుకుపోతోంది. సంక్రాంతి బరిలోంచి అన్ని సినిమాలు తప్పుకోవడంతో బంగార్రాజు సింగిల్‌గా నిలిచాడు. 


జనవరి 14వ తేదీన మొత్తం 8 వందల థియేటర్లలో విడుదలైన సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇతర సినిమాలు లేకపోవడంతో థియేటర్లు భారీగా లభించాయి. కరోనా మహమ్మారి ప్రభావం పడుతుందనుకున్నవారి అంచనాలు తలకిందులయ్యాయి. నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య కాంబినేషన్ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెద్ద సినిమాలన్నీ వెనుదిరిగినా..అపారమైన నమ్మకం, ధైర్యంతో నాగార్జున బంగార్రాజును (Bangarraju Movie) విడుదల చేయించాడు. ఆ నమ్మకమే నిజమై..కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో కామెడీ, కంటెంట్, కధనం అన్నీ బాగుండటంతో ప్రేక్షకులకు బంగార్రాజు బాగా దగ్గరయ్యాడు. 


Also read: Aha OTT: తమిళ్​లోనూ 'ఆహా' అనిపింపించాలని అల్లు అరవింద్​ ప్లాన్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook